కరోనా కేసుల్లో నాల్గవ స్థానానికి అతి చేరువలో ఇండియా .. గత 24 గంటల్లో 9,996 కేసులు
భారతదేశంలో రోజురోజుకీ కరోనా ఉధృతి పెరిగిపోతోంది. కరోనాకేసుల సంఖ్య ప్రతినిత్యం పదివేలకు చేరువలో ఉంటుంది. భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటి వరకు 2,87,754 కు చేరింది. జూన్ 1 నుండి దేశం ప్రతిరోజూ 10,000 కేసులకు దగ్గరగా కేసులు నమోదు చేస్తోంది. అంటే జూన్ 1 నుండి 10 వరకు దేశవ్యాప్తంగా దాదాపు 90,000 కేసులు నమోదయ్యాయి.
ప్రస్తుత కేసుల పెరుగుదలతో, మహమ్మారి బారిన పడిన దేశాల ప్రపంచ జాబితాలో భారతదేశం ఈ వారంలో మూడు లక్షలకు చేరుకుంటుంది.
Recommended Video

కరోనా ప్రభావిత దేశాల జాబితాలో నాల్గవ స్థానానికి అతి చేరువలో
అత్యధికంగా దెబ్బతిన్న నాలుగవ దేశమైన యునైటెడ్ కింగ్‌డమ్ ను అధిగమించే అవకాశం ఉంది. ఇక రేపటి లోగా భారత్ కరోనా కేసుల్లో నాల్గవ స్థానానికి చేరుతుందని తాజా లెక్కలు చెప్తున్నాయి .ఇక యూకేలో 2.91 లక్షలకు పైగా కేసులు ఉన్నాయి. ఇక భారత్ తాజా పరిస్థితి నాల్గవ స్థానానికి అత్యంత చేరువలో ఉంది .మొత్తం కరోనా కేసుల సంఖ్య నేడు 2,86,579 కు పెరిగిందని, ఇందులో 1,37,448 క్రియాశీల కేసులు ఉన్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక ఇండియాలో గత 24 గంటల్లో అత్యధికంగా 9,996 తాజా కోవిడ్ -19 కేసులు, 357 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన తాజా సమాచారం.

అత్యంత ప్రభావిత దేశాలతో పోటీ పడుతున్న ఇండియా
కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపధ్యంలో భారత్ త్వరలోనే యూకే ,బ్రిటన్ లను అధిగమించి కరోనా కేసుల్లో ప్రపంచ అత్యంత ప్రభావిత దేశాలతో పోటీ పడేలా ఉంది . ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు అమెరికాలో నమోదయ్యాయి. ఇక్కడ 20 లక్షల మందికిపైగా కరోనా బారిన పడ్డారు. తర్వాతి స్థానంలో బ్రెజిల్ (7.7 లక్షలు కేసులు) ఉండగా.. రష్యా (4.93 లక్షల కేసులు) మూడో స్థానంలో ఉంది. ఇక యూకేలో 2.91 లక్షలకు పైగా కేసులు ఉన్నాయి. భారత్‌లో కేసుల తీవ్రత ఇలాగే పెరుగుతూ పోతే.. రేపటికల్లా మనదేశం యూకేని దాటేసి నాలుగో స్థానానికి చేరే అవకాశం ఉంది.

మహారాష్ట్రలో పరిస్థితి దారుణం .. ఒక్కరోజే 3,254 కొత్త కేసులు
మహారాష్ట్రలో పరిస్థితి ఏ మాత్రం మారలేదు. ఈ రోజు 3,254 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి . మహారాష్ట్రలో కరోనా బీభత్సం సృష్టిస్తుంది. కరోనా కారణంగా ఆ రాష్ట్రంలో ఒక్క రోజే 149 మంది మరణించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఒక్కరోజే ఈ స్థాయిలో మరణాలు చోటు చేసుకోవడం ఇదే తొలిసారి. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 94,041 కి పెరిగింది. ఇక రాష్ట్రంలో సంభవించిన మరణాలు కూడా 3,438 కి చేరుకున్నాయి .












Click it and Unblock the Notifications