పెరిగిన కరోనా కేసులు - 16.16 శాతానికి చేరిన పాజిటివిటీ రేటు : 614 మరణాలు..!!

భారత్ లో మరోసారి కరోనా కేసులు పెరిగాయి. ముందు రోజు కంటే స్వల్ప పెరుగుదల నమోదైంది. దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ వేగవంతం అవుతున్నా.. వ్యాప్తి మాత్రం తగ్గటం లేదు. ప్రధానంగా అయిదు రాష్ట్రాల్లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. మంగళవారం దేశ వ్యాప్తంగా 2,55,874 క‌రోనా కేసులు రిజిస్టర్ అయ్యాయి. కాగా, గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,85,914 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కరోనా మరణాలు కూడా పెరిగాయి. మంగళవారం 614 మంది మృతి చెందగా... బుధవారం 665 మంది కరోనాతో మరణించారు.

16.16 శాతంగా పాజిటివిటీ రేటు

16.16 శాతంగా పాజిటివిటీ రేటు

తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,00,85,116కి చేరింది. కరోనా మరణాల సంఖ్య 4,91,127కి పెరిగింది. ఇక, మరోవైపు దేశంలో గడిచిన 24 గంటల్లో 2,99,073 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా రికవరీల సంఖ్య 3,73,70,971కి చేరింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 22,23,018గా నమోదైంది.

గడిచిన 24 గంటల్లో 59,50,731 మందికి కరోనా వ్యాక్సిన్లు వేశామని... ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,63,58,44,536 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 16.16గా ఉందని కేంద్రం తెలిపింది.

ప్రపంచ వ్యాప్తంగా తీవ్రత

ప్రపంచ వ్యాప్తంగా తీవ్రత

దేశంలోనే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో కోవిడ్ కేసులు పెరిగాయి. కొత్తగా 33,20,485 మందికి కరోనా సోకింది. 9,650 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 35,90,43,286కి చేరగా.. మరణాల సంఖ్య 56,33,406కు పెరిగింది. అమెరికాలో కరోనా వ్యాప్తి వేగంగా ... ఎక్కువగా ఉంది. అమెరికాలో కరోనా కల్లోలం కొనసాగుతోంది.

కొత్తగా 4,43,072 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. 2,611 మంది మరణించారు. దీంతో..కేసుల సంఖ్య 7.3 కోట్లు దాటిందని అధికారులు వెల్లడించారు. అర్జెంటీనాలో తాజాగా 1,00,863 కరోనా కేసులు బయటపడగా.. 259 మంది బలయ్యారు.జర్మనీలో 1,48,408 వేల మందికి వైరస్ సోకింది. మరో 184 మంది మృతి చెందారు.బ్రిటన్​లో మరో 94,326 వేల మంది వైరస్ బారిన పడ్డారు.​ 439 మంది మృతి చెందారు.స్పెయిన్​లో తాజాగా 1,14,877 కేసులు బయటపడ్డాయి.

తెలుగు రాష్ట్రాల్లో అప్రమత్తంగా

తెలుగు రాష్ట్రాల్లో అప్రమత్తంగా

మరో 382 మంది మరణించారు. ఫ్రాన్స్​లో ఒక్కరోజే 5,01,635కేసులు వెలుగుచూశాయి. మరో 467 మంది చనిపోయారు.ఇటలీలో 186,740 కొత్త కేసులు బయటపడగా.. 338 మంది మరణించారు. బ్రెజిల్​లో కొత్తగా 1,99,126 మందికి వైరస్​ సోకగా.. 489 మంది చనిపోయారు. తెలుగు రాష్ట్రాల్లోనూ కేసుల సంఖ్య పెరుగుతోంది.

ఏపీలో రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. రేపటి నుంచి ఆంక్షలను మరింత కఠినతరం చేసే దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇక, తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ అవసరం లేదని ప్రభుత్వం తేల్చింది. అయితే, ఇంటింటి సర్వే ద్వారా బాధితులను గుర్తించి...వారికి అవసరమైన వైద్య సాయం అందిస్తోంది. రానున్న వారం రోజుల్లో కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+