థర్డ్ వేవ్ తగ్గుముఖం - 50,407 కరోనా కేసులు: పాజిటివిటీ రేటు 3.48 శాతం..!!

దేశ వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పట్టింది. థర్డ్ వేవ్ ముప్పు తప్పినట్లుగానే కనిపిస్తోంది. గత నెలలో మూడు లక్షలకు పైగా నమోదైన కేసులు... ఇప్పుడు 50 వేలకు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 50,407 కరోనా కేసులు రిజిస్టర్ అయ్యాయి. దీంతో..మొత్తం కేసుల సంఖ్య 4,25,86,544కి చేరింది. కాగా, ఇదే సమయంలో మరణాల సంఖ్య 804గా నమోదైంది. ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,07,981కి పెరిగింది. 1,36,962 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 3.48 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 6,10,443గా నమోదైంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,36,962 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా రికవరీల సంఖ్య 4,14,68,120కి చేరింది. గడిచిన 24 గంటల్లో 46,82,662 మందికి కరోనా వ్యాక్సిన్‌లు వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,72,29,47,688 డోసుల కరోనా వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లు హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. ఇక, వ్యాక్సినేషన్ ప్రక్రియ సైతం కొనసాగుతోంది. కొత్తగా 46,82,662 టీకా డోసులను పంపిణీ చేశారు. ఇప్పటివరకు మొత్తం 1,72,29,47,688 డోసులు పంపిణీ చేసారు.

India recorded 50,407 new covid cases, recovery rate now stands at 97.37 per cent

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజే 23 లక్షల మంది మహమ్మారి బారిన పడ్డారు. మరో 10,927 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కొవిడ్​ కేసుల సంఖ్య 40.86 కోట్లు దాటగా.. మరణాల సంఖ్య 58,19,705కు చేరింది. జర్మనీలో మరో 2.29 లక్షల మంది వైరస్ బారినపడ్డారు. మరో 215 మంది ప్రాణాలు కోల్పోయారు.రష్యాలో ఒక్కరోజే 2 లక్షల మందికి కొవిడ్ పాజిటివ్​గా తేలింది. మరో 722 మంది మృతిచెందారు.బ్రెజిల్​లో కొత్తగా 1.66 లక్షల మందికి కరోనా సోకింది.

Recommended Video

    COVID-19 సోకి తగ్గాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ? | Oneindia Telugu

    1,121 మంది మరణించారు.అమెరికాలో తాజాగా 1.49 లక్షల కేసులు బయటపడగా.. 1,917 మంది బలయ్యారు.ఫ్రాన్స్​లో ఒక్కరోజే 1.31 లక్షల మంది మందికి వైరస్ సోకింది. మరో 329 మంది మృతిచెందారు. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసుల సంఖ్య తగ్గిపోయింది. తెలంగాణ ఇప్పటికే థర్డ్ వేవ్ ముగిసినట్లుగా ప్రకటించింది. ఏపీలో ఆంక్షలు కొనసాగుతున్నా.. కరోనా తీవ్రత మాత్రం తగ్గుముఖం పట్టింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+