PoKలో ఎన్నికలు చట్ట విరుద్ధం -భారత్ తీవ్ర నిరసన -పాక్ ఆర్మీకి వ్యతిరేకంగా స్థానికుల నిరసనలు
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో జరిగిన ఎన్నికలు చట్టవిరుద్ధమైనవి, వాటిని గుర్తించబోమని భారత్ స్పష్టం చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ గురువారం ఒక ప్రకటన చేసింది. పీఓకేలో ఎన్నికలను అక్కడి ప్రజలు పూర్తిగా తిరస్కరించారని విదేశాంగ శాఖ పేర్కొంది.
ఆ ప్రాంతాన్ని చట్ట విరుద్ధంగా ఆక్రమించామన్న విషయాన్ని దాచిపెట్టడానికే పాక్ ఇలాంటి ప్రయత్నాలకు ఒడిగడుతోందని విదేశాంగ శాఖ నిప్పులు చెరిగింది. పీఓకేలోని ప్రజలను పాక్ ఎలా చూస్తున్నారు, మానవ హక్కులను ఎలా ఉల్లంఘింస్తున్నారన్న విషయాలను ఈ ఎన్నికలు దాచిపెట్టలేవని ఘాటుగా వ్యాఖ్యానించింది. చట్ట విరుద్ధంగా ఆక్రమించిన ప్రాంతాలను పాక్ వెంటనే ఖాళీ చేయాల్సిందేనని భారత విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది.

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగిందని ఆ ప్రాంత ప్రజలు ఆరోపించారు. భారీగా పాక్ ఆర్మీని మోహరించడంపై పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ నెల 25న జరిగిన ఎన్నికల్లో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) 25 స్థానాల్లో, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) 11, పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పిఎంఎల్-ఎన్) 6 స్థానాల్లో గెలిచాయి. పీవోకే అసెంబ్లీలోని మొత్తం 53 మంది సభ్యులకు 45 మందిని ఎన్నికల ద్వారా నేరుగా ఎన్నుకుంటారు.

మరోవైపు పీవోకేలోని గిల్గిట్-బాల్టిస్థాన్‌లో ఎన్నికలను పాకిస్థాన్ నిర్వహించడాన్ని భారత్ ఖండించింది. సైనిక ఆక్రమిత ప్రాంతం స్థితిని మార్చేందుకు చేసిన ఈ చర్యకు ఎటువంటి చట్టపరమైన ఆధారం, విలువ లేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Click it and Unblock the Notifications