ఏ రూపంలో ఉన్నా వదిలే ప్రసక్తే లేదు- ప్రధాని మోదీ హెచ్చరిక

ప్రపంచం మొత్తాన్నీ ఉలిక్కిపడేలా చేసిన ఉదంతం.. పహల్గామ్ ఉగ్రదాడి. ఆ అమానవీయ ఘటన చోటు చేసుకుని ఏడాది అవుతోంది. గత సంవత్సరం సరిగ్గా ఇదే రోజున అంటే ఏప్రిల్ 22న పాకిస్తాన్ ప్రోత్సాహిత ఉగ్రవాదులు పహల్గామ్ పై దాడి చేశారు. 26 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘాతుకంపై అమెరికా మొదలుకుని ఆఫ్ఘనిస్తాన్ దాకా దాదాపుగా అన్ని దేశాలు స్పందించాయి. భారత్‌కు అండగా నిలిచాయి. ఉగ్రవాద నిర్మూలనకు సహకరిస్తామని వెల్లడించాయి.

ఈ దిగ్భ్రాంతికర ఘటనను కేంద్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్న విషయం తెలిసిందే. అదే ఏడాది మే 10న పాకిస్తాన్ పై యుద్ధానికి దిగింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదుల పీచమణిచింది. అదే సమయంలో పాకిస్తాన్‌పై కఠిన ఆంక్షలను విధించింది. ఇండస్ రివర్ ట్రీటీ సహా పలు కీలక నిర్ణయాలను అమలులోకి తీసుకొచ్చింది. అట్టారీ-వాఘా సరిహద్దు చెక్‌పోస్ట్‌ను మూసివేయడమే కాకుండా దేశంలో నివసిస్తోన్న పాకిస్తానీయులనూ స్వదేశానికి వెళ్లిపోవాలంటూ ఆదేశించింది.

India Remembers the Pahalgam Attack Victims and PM Modi Indian Army Reaffirms Resolve Against Terror

నాటి ఈ దురాగతానికి ఏడాది పూర్తయిన సందర్భాన్ని ప్రధాని మోదీ స్మరించుకున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి అమరులకు నివాళి అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఉగ్రవాదుల రక్తదాహానికి బలైన అమాయకులను ఎప్పటికీ విస్మరించబోమని అన్నారు. ఉగ్రవాదం పట్ల అత్యంత కఠిన వైఖరిని అవలంభించి తీరుతామని తేల్చి చెప్పారు. ఈ విషయంలో భారత్ ఎప్పటికీ దృఢనిశ్చయంతో ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ మేరకు తన అధికారిక ఎక్స్ లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు. తమ ఆప్తులను కోల్పోయిన కుటుంబాల దుఖ్ఖాన్ని పంచుకుంటున్నామని, దేశం మొత్తం ఆ కుటుంబాల వారికి అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ సామూహిక సంకల్పాన్ని, ఐక్యతను, దృఢత్వాన్ని ప్రధాని పునరుద్ఘాటించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని అణచివేస్తామని ఉగ్రవాదులకు తలవంచబోమని అన్నారు. వారి కుట్రలు ఎప్పటికీ సఫలం కాబోవని అన్నారు. ఇండియన్ ఆర్మీ కూడా నాటి ఉదంతానికి నివాళి అర్పించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+