గతేడాది ఇదేరోజు తొలి కరోనా కేసు నమోదు.. ఇవాళ కేసుల సంఖ్య.. ఏడాదిలో జరిగిన మార్పులివే..?

కరోనా వైరస్ ఆనవాళ్లు బయటపడి ఏడాది గడిచిపోతోంది. సరిగ్గా భారతదేశంలో సంవత్సరం క్రితం ఇదే రోజు తొలి కరోనా కేసు నమోదైంది. తర్వాత కేసుల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. ఏడాది క్రితం కేరళకు చెందిన ఓ విద్యార్థికి కరోనా వైరస్ వచ్చింది. వైరస్ ఆవిర్భవించిన చైనాలోని వుహాన్‌ నుంచి అతను వచ్చారు. దేశంలో అడుగిడిన తర్వాత వైరస్ గురించి తెలిసింది. దీంతో మార్చి నెల నుంచి దేశంలో లాక్ డౌన్ విధించి.. వైరస్‌ను కట్టడి చేశారు.

లాక్ డౌన్ వల్ల ఫ్యాక్టరీ/ స్కూల్స్, కార్యాలయాలు/ షాపులు మూసివేశారు. అత్యవసర వస్తువులు సరఫరా చేసేవీ తప్ప.. మిగతా అన్నీ క్లోజ్ చేశారు. దీంతో భారత ఆర్థిక వ్యవస్థపై దెబ్బ పడింది. ఎకానమీపై ప్రభావం పడటంతో మెల్లగా లాక్ డౌన్ నిబంధనలను సడలింపు చేసింది. జూన్ నుంచి క్రమంగా సడలింపులు ఇవ్వడం ప్రారంభించారు. ఆ తర్వాత వైరస్ కేసులు క్రమంగా బయటపడ్డాయి. శనివారం 13 వేల 83 కేసులు వచ్చాయి. ఇదివరకు రోజుకు 20 వేల కేసులు ఉండగా.. దాదాపు 7 వేల వరకు తగ్గాయి. దీనికి సంబంధించి వైద్యారోగ్య శాఖ గణాంకాలు నివేదిస్తున్నాయి.

India reported its 1st Covid case on this day last year

దేశంలో కోటి 70 లక్షల మందికి వైరస్ సోకింది. అయితే లక్ష 54 వేల 147 మందికి చనిపోయారు. 130 కోట్ల దేశ జనాభాలో తక్కువ సంఖ్యలో వైరస్ వ్యాపించింది. అమెరికాలో కరోనా కేసులు ఎక్కువ ఉన్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కోసం వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ నెల 16వ తేదీ నుంచి వైద్యారోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. జూలై- ఆగస్ట్ నెల వరకు 30 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇస్తామని కేంద్రం చెబుతోంది. ప్రపంచంలో అత్యధిక జనాభా గల చైనా తొలి రెండు వారాల్లో 35 లక్షల మంది వైద్యారోగ్య సిబ్బందికి వ్యాక్సిన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+