భారత్‌లో బుసలు కొడుతున్న కరోనా.. ఒక్కరోజులో 3.33 లక్షల కొత్త కేసులు
భారత్‌లో కరోనా మమహ్మరి చాపకింద నీరులా పాకుతుంది. రోజుకు లక్షల సంఖ్యల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 18,75,533 శాంపిల్స్ పరీక్షించగా.. 3,33,533 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. మహమ్మారితో పొరాడుతూ 525 మంది మరణించారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 21,87,205కు చేరింది. ఈమేరకు కేంద్ర ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది.

.కరోనా విలయతాండవం..
దేశంలో కరోనా రికవరీ రేటు 93.18 శాతం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 2, 59, 168 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి రికవరీ అయిన వారి సంఖ్య 3,65,60,650కి చేరింది. ఒక్కరోజు వ్యవదిలో 18,75,533 శాంపిల్స్ పరీక్షించగా .. 3,33,533 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం 3.89 మందికి కరోనా సోకగా.. 4,89,409 మంది మృతి చెందారు.

వ్యాక్సినేషన్ వేగవంతం
కాగా, ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 161, 92,84,270 మందికి కరోనా వ్యాక్సిన్ చేసినట్లు తెలిపింది. గడిచిన 24 గంటల్లోనే 71 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకునట్లు పేర్కొంది. 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల మధ్య వారిలో 4,15,77,103 మందికిపైగా టీకా తీసుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో మహారాష్ట్ర, కేరళలో కరోనా విలయతాండవం చేస్తుంది. కేసులు సంఖ్య పెరుగుతుండడంతో పరిస్థితి ఆందోళన కరంగా ఉంది.

మహారాష్ట్రలో తగ్గని వ్యాప్తి..
మహారాష్ట్రలో గడిచిన 24 గంటల వ్యవధిలో 46,393 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో 416 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఉన్నట్లు తేలింది. 48 మంది వైరస్ బారిన పడి మరణించారు. ఇక ముంబాయిలో 3,568 కొత్త కేసులు నమోదుయ్యాయి. శనివారంతో పోలిస్తే కాస్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.

కేరళ, ఢిల్లీలో పెరిగిన బాధితులు
కేరళ రాష్ట్రంలోనూ కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా 45,136 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో శనివారంతో పోలిస్తే కాస్త కేసులు సంఖ్య పెరిగింది. కొత్తగా 11,486 మందికి పాజిటివ్ గా నిర్థారణ అయింది. 45 మంది మరణించారు. పాజిటివిటీ రేటు 16.36శాతానికి చేరింది.

పూర్తిస్థాయిలో లాక్‌డౌన్
తమిళనాడుతో కరోనా వ్యాప్తి అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 30,744 కొత్త కేసులు నమోదు కాగా.. 33 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,94 697 చేరింది. ఒక్క చెన్నైలోనే 6,452 మందికి కరోనా బారినపడ్డారు. కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ కట్టడికి ఆదివారం పూర్తిస్థాయిలో లాక్ డౌన్ విధించింది. అత్యవసర వాహనాలను మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు . బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద ఆటోలు, ప్రీ పేయిడ్ ట్యాక్సీలు, క్యాబ్‌లు తిరగడానికి ప్రభుత్వం మినహాయింపునిచ్చారు.
-
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
IT ఉద్యోగులకు గుడ్ న్యూస్. లేఆఫ్స్ లేవు.. కంపెనీ కీలక ప్రకటన! -
BCCI కు ఆ లక్కీ ఛాంప్ ఎలా దొరికింది? ప్రార్థన చేసి.. ప్రపంచ కప్ గెలిచి.. -
T20 World Cup Final: నోర్మూయిస్తాం..! చాలా చూశాం..! ఫైనల్ వేళ శాంట్నర్ వర్సెస్ సూర్య..! -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
తమిళనాడు ఎన్నికలు.. విజయ్ హామీలు ఇవే.. -
బరువు తగ్గాలంటే చనా వెజ్ సలాడ్ ఇలా ట్రై చెయ్యండి! -
రాష్ట్రంలో 'బీచ్ వెడ్డింగ్' జోరు.. తక్కువ ధరకే సముద్ర తీరాన వివాహం.. -
టీమిండియాకు టీ20 కెప్టెన్ షాక్? రిటైర్మెంట్ వార్తలు నిజమేనా? -
Adani Total Gas: గృహ వినియోగదారులకు ఊరట.. పరిశ్రమలకు గ్యాస్ సరఫరా తగ్గింపు -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక












Click it and Unblock the Notifications