కరోనా..కంట్రోల్: ఆ రెండు రాష్ట్రాల్లోనే కలవరం: అక్కడ వీకెండ్ లాక్‌డౌన్స్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో తగ్గుదల స్థిరంగా కొనసాగుతూనే ఉంది. రెండు, మూడు రాష్ట్రాలు మినహా దాదాపుగా అన్ని చోట్లా సాధారణ సంఖ్యలో కేసులు నమోదవుతోన్నాయి. డెల్టా ప్లస్ వేరియంట్ కొంత ఆందోళనను కలిగిస్తోన్నప్పటికీ.. దాని పట్ల కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉంటోన్నాయి. నియంత్రణా చర్యలను తీసుకుంటోన్నాయి. ఎప్పటికప్పుడు తాజా మార్గదర్శకాలను జారీ చేస్తూ వస్తోన్నాయి. ఫలితంగా- దేశంలో రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్యలో అదుపులోనే ఉంటోంది.
ఆగస్టు చివరివారంలో థర్డ్‌వేవ్ ఆరంభమయ్యే అవకాశాలు ఉన్నాయంటూ నిపుణులు హెచ్చరిస్తోన్న నేపథ్యంలో అటు కేంద్ర ప్రభుత్వం కూడా ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటోంది. వ్యాక్సినేషన కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తోంది. కొత్తగా జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి ఇవ్వడానికి అవసరమైన ప్రక్రియను పూర్తి చేస్తోంది. అలాగే- కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ల మిశ్రమానికీ చర్యలు తీసుకునే అవకాశాలను పరిశీలిస్తోంది.

వ్యాక్సిన్లను మిళితం చేయడం వల్ల అవి మరింత ప్రభావవంతంగా కరోనా వైరస్‌ను నిర్మూలిస్తాయంటూ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ స్పష్టం చేసిన నేపథ్యంలో- దీనిపై ఓ విధానపరమైన నిర్ణయాన్ని తీసుకోవడానికి కేంద్రం చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ పరిస్థితుల మధ్య దేశంలో కరోనా వైరస్ విజృంభణ నియంత్రణలోనే ఉంటోంది. దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 35,499 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే స్థాయిలో డిశ్చార్జీలు కూడా నమోదయ్యాయి. రికవరీ రేటు 97.40 శాతంగా నమోదైంది.
మరణాల సంఖ్యలో తగ్గుదల కొనసాగుతోంది. యాక్టివ్ కేసులు కూడా భారీగా తగ్గాయి. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తాజాగా జారీ చేసిన బులెటిన్ ప్రకారం.. యాక్టివ్ కేసుల సంఖ్య 4,02,188గా నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలు నమోదైన దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంటోంది. ఇప్పటిదాకా 4,28,339 మంది కరోనా వైరస్ కాటుకు బలి అయ్యారు. భారత్ కంటే ముందు అగ్రరాజ్యం అమెరికా, బ్రెజిల్‌లో కరోనా మరణాలు అధికంగా ఉన్నాయి. అమెరికా-6,33,116, బ్రెజిల్-5,63,470 మంది మరణించారు. ఆ తరువాతి స్థానంలో భారత్ నిలిచింది.
మరోవంక వ్యాక్సినేషన్ కార్యక్రమంగా జోరుగా సాగుతోంది. ఇప్పటిదాకా వ్యాక్సిన్లను వేసుకున్న వారి సంఖ్య 50 కోట్లను దాటేసినట్లు కేంద్రం తన తాజా బులెటిన్‌లో పేర్కొంది. కరోనా తీవ్రత కేరళ, మహారాష్ట్ర వంటి రెండు, మూడు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంటోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి కేరళ ప్రభుత్వం వీకెండ్ డేస్‌లల్లో లాక్‌డౌన్‌ను అమలు చేస్తూ వస్తోంది. శని, ఆదివారాల్లో కొన్ని నగరాల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ను విధిస్తోంది. ఇదే తరహా నివారణ చర్యలను కూడా మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications