గోధుమల ఎగుమతి నిలిపేసిన భారత్- కేంద్రం నిర్ణయం వెనుక కారణాలివే..
భారత్ లో వేసవిలో మారుతున్న వాతావరణ పరిస్ధితుల ప్రభావం గోధుమలపై పడుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతంలో గోధుమల ధరలు నానాటికీ పెరుగుతున్నాయి. వడగాల్పులకు తోడు దేశీయంగా పెరుగుతున్న ధరలు గోధుమల మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో కేంద్రం ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది.
తాజాగా గోధుమల ఎగుమతులను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిన్న రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. జాతీయ ఆహార భద్రత దృష్ట్యా ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్త ఆహార కొరతను అధిగమించడానికి సరుకులను పంపే విధానాన్ని అకస్మాత్తుగా కేంద్రం రద్దు చేసింది. తాజా ఎగుమతులపై పూర్తి నిషేధాన్ని విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

తీవ్రమైన వడగాల్పులతో పాటు దేశీయ ఆహార ధరలు, ముఖ్యంగా తృణధాన్యాల ధరలు గణనీయంగా పెరగడంతో ఉత్పత్తిలో భారీ తగ్గుదల ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఎగుమతులపై నిషేధం విధించింది. జాతీయ ఆహార భద్రత దృష్ట్యా ఈ చర్య తీసుకున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నోటిఫికేషన్ పేర్కొంది. ప్రైవేట్ వ్యాపారులు ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్న, క్రెడిట్ లెటర్‌లు జారీ చేసిన ఎగుమతి ఆర్డర్‌లపై ఈ నియంత్రణలు ప్రభావం చూపవు. నోటిఫికేషన్ తేదీలో లేదా అంతకు ముందు క్రెడిట్ లెటర్ ఆఫ్ క్రెడిట్ జారీ చేసి ఉంటే సదరు ఎగుమతుల్ని అనుమతిస్తారు. ఇతర దేశాల ఆహార భద్రత అవసరాలను తీర్చడానికి భారత ప్రభుత్వం మంజూరు చేసిన అనుమతి ఆధారంగా ప్రభుత్వాల అభ్యర్థన మేరకు ఎగుమతులు అనుమతిస్తామని నోటిఫికేషన్ లో కేంద్రం పేర్కొంది.












Click it and Unblock the Notifications