68వేలకు పైగా కొత్త కేసులతో .. కోటి 20 లక్షల మార్క్ దాటి .. భారత్ లో కరోనా విలయం

భారతదేశంలో కరోనా కంట్రోల్ తప్పుతోంది. రోజురోజుకు పెరుగుతున్న కేసులు భారత ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత 24 గంటల్లో 68,020 కొత్త కేసులు నమోదు కాగా , భారతదేశం యొక్క కరోనా కేసుల సంఖ్య సోమవారం 1,20,39,644 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. అదే సమయంలో దేశంలో 291 తాజా మరణాలు నమోదయ్యాయి, దీంతో ఇండియాలో కరోనా కారణంగా మరణాల సంఖ్య 161,843 కు చేరుకుంది.

భారత్ లో ఆందోళనకరంగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ యాక్టివ్ కేసులు

భారత్ లో ఆందోళనకరంగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ యాక్టివ్ కేసులు

ఇప్పటివరకు కరోనా నుండి కోలుకొని 11,355,993 మంది రోగులను డిశ్చార్జ్ చేసినట్లు తేలింది.

గత 24 గంటల్లో యాక్టివ్ కేసులు 35,498 కేసులు చేర్చబడిన తరువాత మళ్ళీ భారతదేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య అర మిలియన్ మార్కును దాటింది. ఇది ప్రస్తుతం దేశానికి ఆందోళన కలిగించే అంశం ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారం. క్రియాశీల కేసుల సంఖ్య ఇప్పటివరకు 5,21,808గా ఉంది. క్రియాశీల కేసుల సంఖ్య పెరుగుతుండడం ఇండియా డేంజర్ జోన్లోకి వెళుతుంది అన్న సంకేతం ఇస్తుంది.

వారం రోజుల్లోనే 1,78,000 కంటే ఎక్కువ క్రియాశీల కేసులు

వారం రోజుల్లోనే 1,78,000 కంటే ఎక్కువ క్రియాశీల కేసులు

ఒక వారం రోజుల్లో , దేశం 1, 78,000 కంటే ఎక్కువ క్రియాశీల కేసులను నమోదు చేయడం, గత ఏడాది మార్చిలో కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకూ ఇదే అధికం. క్రియాశీల కేసులు పెరుగుతుండటం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతోంది .

దేశంలో కోవిడ్ -19 కేసుల పెరుగుదలలో ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ముందున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వాటిలో భయంకరంగా కరోనా మహమ్మారి బారిన పడిన మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది.

మహారాష్ట్రలో కంట్రోల్ లో లేని కరోనా .. లాక్ డౌన్ నిర్ణయం

మహారాష్ట్రలో కంట్రోల్ లో లేని కరోనా .. లాక్ డౌన్ నిర్ణయం

ఆదివారం రోజు మహారాష్ట్రలో 40, 414 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. దీంతో మహారాష్ట్రలో లాక్ డౌన్ విధించాలని నిర్ణయం తీసుకుంటున్నారు
. మహారాష్ట్ర రాజధాని ముంబై ఆదివారం ఒక రోజులో అత్యధికంగా 6,933 కొత్త కేసులను నమోదు చేసి, మొత్తం 3,98,724 కు చేరుకుంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం మహారాష్ట్ర అత్యధిక పాజిటివిటీ రేటును కలిగి ఉంది - 22,78 శాతం పాజిటివిటీ రేటుతో , జాతీయ సగటు 5.04 శాతానికి మించి మహారాష్ట్రలో కరోనా విలయం కొనసాగుతుంది.

 జాతీయ సగటు కంటే ఎక్కువ సానుకూలత కలిగిన రాష్ట్రాలివే

జాతీయ సగటు కంటే ఎక్కువ సానుకూలత కలిగిన రాష్ట్రాలివే

మహారాష్ట్రతో పాటు, జాతీయ సగటు కంటే ఎక్కువ సానుకూలత కలిగిన ఇతర ఏడు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి . చండీగడ్ (11.85 శాతం పాజిటివిటీ రేటు), పంజాబ్ (8.45 శాతం), గోవా (7.03 శాతం), పుదుచ్చేరి (6.85 శాతం) ), ఛత్తీస్‌ గడ్ (6.79 శాతం), మధ్యప్రదేశ్ (6.65 శాతం), హర్యానా (5.41 శాతం) గా ఉంది . ఇక కరోనా నిర్ధారణ పరీక్షల విషయంలో15 రాష్ట్రాలు / యుటిలు జాతీయ సగటు (1,74,602) కంటే మిలియన్‌కు తక్కువ పరీక్షలను చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలు ఉన్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇదిలావుండగా, దేశంలో మొత్తం వ్యాక్సినేషన్ ఆదివారం వరకు 6 కోట్ల మార్కును అధిగమించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+