భారత తొలి కరోనా టెస్టింగ్ కిట్ రెడీ: ధర రూ. 80వేలు, 100 మందికి పరీక్షలు చేయొచ్చు

ముంబై: మహారాష్ట్రలోని పుణెకు చెందిన మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ దేశీయంగా తొలి కొవిడ్-19 టెస్టింగ్ కిట్ తయారు చేసింది. దీనికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ఆమోద ముద్ర లభించింది. కాగా, ఒక సింగ్ కిట్ ధర రూ. 80వేలుగా నిర్ణయించారు. ఒక కిట్ ద్వారా 100 రోగులకు పరీక్షలు నిర్వహించవచ్చు. కాగా, ఇప్పటి వరకు విదేశాల నుంచి తెచ్చుకున్న వాటితోనే పరీక్షలు నిర్వహించడం జరుగుతోంది.

ఇది ఇలావుండగా, కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు దేశంలో మరో 10 ప్రైవేటు ల్యాబ్ లకు బయో మెడికల్ పరిశోధనల సాధికార సంస్థ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) అనుమతి లభించింది. దీంతో భారతదేశంలో కరోనా నిర్ధరాణ పరీక్షకు అధికార అనుమతి పొందిన ప్రైవేటు ల్యాబ్ ల సంఖ్య 16కు పెరిగింది.

Indias first indigenous COVID19 testing kit ready: A single kitcosts Rs 80,000.

దేశ రాజధాని న్యూఢిల్లీలో 3, గుజరాత్‌లో 2, హర్యానాలో 2, కర్ణాటకలో 1, మహారాష్ట్రలో 5, తమిళనాడులో 2 ఉన్నాయి. ఇక తెలంగాణలోని హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో అపోలో హాస్పిటల్స్‌కు కూడా ఈ అనుమతి లభించింది.

కరోనా నిర్ధారణ పరీక్షలకు వసూలు చేయాల్సిన అత్యధిక మొత్తం రూ. 4500గా కేంద్రం ప్రకటించింది. దీనిలో రూ. 1500 స్క్రీనింగ్ పరీక్షల నిమిత్తం కాగా, రూ. 3వేలు నిర్ధారణ పరీక్షల కోసం అని స్పష్టం చేసింది. ఈ నిబంధనను పాటించని సంస్థలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+