కులగణనపై కేంద్రం కీలక నిర్ణయం.. ఈ రాష్ట్రాలకు బిగ్ షాక్..?

దేశంలో కులగణన చేపట్టాలని ఏళ్లనుంచి డిమాండ్ ఉంది. రాజకీయ, ఆర్థిక, సంక్షేమ ఫలాలు బడుగు బలహీన అట్టడుగు వర్గాల వరకు చేరాలంటే కులగణన చేపట్టాల్సిందేనని ప్రతిపక్షాలతోపాటు దేశవ్యాప్తంగా ప్రజల నుంచి నినాదాలు వినిపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కులగణన చేపట్టాలని నిర్ణయించింది. రెండు దశల్లో దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కీలక నిర్ణయం తీసుకుంది.

2027, మార్చి 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు జనగణనను సైతం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. వచ్చే ఏడాది అక్టోబర్‌ 1 నుంచి తొలి దశ కులగణన చేపట్టేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. 2027 మార్చి 1 నుంచి రెండో దశ కుల గణన చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇక తొలి దశలో ప్రతికూల వాతావారణం కలిగిన ప్రాంతాలైన ఉత్తరా ఖండ్‌, జమ్మూ కాశ్మీర్‌, లద్ధాఖ్‌, హిమాచల్‌‌ రాష్ట్రాల్లో కులగణన చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

India s Historic Caste Census to Begin March 1 2027 After Decades of Debate

ఇక మన దేశంలో చివరిసారిగా 2011లో జనగణన జరిగింది. 1948 పాపులేషన్ సెన్సస్ యాక్ట్, 1990 పాపులేష్ కంట్రోల్ యాక్ట్ ప్రకారం ప్రతి పదేళ్లకోసారి జనగణన నిర్వహిస్తుంటారు. 2021 నిర్వహించాల్సి ఉండగా కొవిడ్-19 కారణంగా జనగణన చేపట్టలేదు. మరోవైపు 2027లో జనగణన ప్రక్రియ తర్వాత.. ఆ సమాచారం ఆధారంగా లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వివిధ రాష్ట్రాల్లోని లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యలోనూ మార్పు రానుంది.

ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు 26 సీట్లు కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు బిగ్ షాక్ తగలబోతున్నట్లుగా భావించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+