India-Sri Lanka Ferry : మళ్లీ భారత్-శ్రీలంక ఫెర్రీ సర్వీసు-టైమింగ్స్, టికెట్ రేట్లు ఇవే...
భారత్ పొరుగునే ఉన్న శ్రీలంకకు వెళ్లేందుకు విమాన ప్రయాణం ఆప్షన్ అందుబాటులో ఉంది. అయితే సముద్ర మార్గంలో ఫెర్రీపై వెళ్లాలంటే మాత్రం సాధ్యమయ్యేది కాదు. గతంలో ఫెర్రీపై ఇరుదేశాల మధ్య రాకపోకలు సాగినా ఆ తర్వాత మాత్రం వాటిని నిలిపేశారు. ఇప్పుడు దాదాపు 40 ఏళ్ల విరామం తర్వాత భారత్ నుంచి శ్రీలంక వెళ్లేందుకు ఫెర్రీ ప్రయాణం అందుబాటులోకి వస్తోంది. తాజాగా ఈ మేరకు రెండు దేశాలు ఈ ఫెర్రీ సర్వీసును అందుబాటులోకి తెస్తున్నాయి.
తమిళనాడు తూర్పు తీరంలోని నాగపట్నం, శ్రీలంక ఉత్తర ప్రావిన్స్‌లోని కంకేసంతురై మధ్య అంతర్జాతీయ హై-స్పీడ్ ప్యాసింజర్ ఫెర్రీ సర్వీస్ దాదాపు నాలుగు దశాబ్దాల విరామం తర్వాత ఇవాళ తిరిగి ప్రారంభమైంది. హై-స్పీడ్ క్రాఫ్ట్ చెరియపాణి 50 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో నాగపట్నం ఓడరేవు నుండి ఉదయం 8.15 గంటలకు తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ప్రధాని మోడీ, లంక అధ్యక్షుడు విక్రమసింఘే ఈ దౌత్యప్రయత్నాన్ని వీడియో ద్వారా ప్రశంసించారు.

భారత్,శ్రీలంక మధ్య దౌత్య, ఆర్థిక సంబంధాలలో ఇది కొత్త అధ్యాయమని మోడీ పేర్కొన్నారు. రామేశ్వరం, తలైమన్నార్ మధ్య కూడా ఫెర్రీ సర్వీస్‌ను తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రెండు దేశాల మధ్య కనెక్టివిటీని మెరుగుపరచడంలో ఇదో ముఖ్యమైన దశ అని లంక అధ్యక్షుడు విక్రమసింఘే తెలిపారు. రెండు దేశాల ప్రజలు చాలా సంవత్సరాలుగా పాక్ జలసంధి మీదుగా ప్రయాణించారని, శ్రీలంకలో అంతర్యుద్ధం కారణంగా గతంలో నడిపే ఫెర్రీ సర్వీసులను నిలిపివేసినట్లు గుర్తుచేశారు.
A historic day in 🇮🇳🇱🇰 relations!
— India in Sri Lanka (@IndiainSL) October 14, 2023
Inaugural ferry from Nagapattinam, India reaches Kankesanthurai in Sri Lanka.
Resumption of ferry link will overcome the four-decade long absence of regular service and bring the two economies, peoples and civilisations further closer. pic.twitter.com/qr3tSmP0zt
ఈ ఫెర్రీ టిక్కెట్ల విక్రయాల కోసం షిప్పింగ్ కార్పొరేషన్ ఓ ప్రైవేట్ ఏజెన్సీని నియమించింది. ఈ నౌకలో 150 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు . నాగపట్నం నుండి ఉదయం 7 గంటలకు బయలుదేరి 11 గంటలకు లంకలోని కంకేసంతురై చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కంకేసంతురై వద్ద మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5.30 గంటలకు నాగపట్నం చేరుకుంటుంది. ప్రయాణానికి వన్-వే టిక్కెట్ ధర సుమారు రూ.7670, అలాగే ప్రతీ ప్రయాణీకుడు 50 కిలోల వరకు బ్యాగేజీని ఆన్‌బోర్డ్‌లో తీసుకెళ్లవచ్చు.ప్రస్తుతానికి అక్టోబర్ 23 వరకూ ఈ సర్వీస్ కొనసాగిస్తారు. రుతుపవనాల కారణంగా మధ్యలో బ్రేక్ ఇస్తామని ఆ తర్వాత తిరిగి రాకపోకలు సాగుతాయని అధికారులు ప్రకటించారు.
-
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications