టర్కీకి మరోసారి షాకిచ్చిన భారత్..
టర్కీకి భారత్ మరోసారి షాకిచ్చింది. పహల్గాం ఉగ్రాదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో పాకిస్థాన్ కు టర్కీ సాయం చేసింది. దీంతో ఆగ్రహించిన భారత్.. టర్కీపై పలు ఆంక్షలు విధించింది.
దేశంలోని తొమ్మిది ప్రధాన విమానాశ్రయాలలో భద్రతా నిర్వహణ బాధ్యతలు చూస్తున్న టర్కీకి చెందిన సెలెబి ఏవియేషన్ సంస్థ భద్రతా అనుమతిని రద్దు చేసింది. అయితే కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సెలెబి ఏవియేషన్ సంస్థ దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే తాజాగా సెలెబి ఏవియేషన్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. దేశ భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము ఖండించలేమని జస్టిస్ సచిన్ ధత్తా స్పష్టం చేశారు. దీంతో టర్కీకి మరోసారి భారీ షాక్ తగిలినట్లుగా భావించవచ్చు.
సెలెబి ఏవియేషన్ సంస్థ తరఫున సీనియర్ అడ్వకేట్ ముఖుల్ రోహత్గి వాదనలు వినిపించారు. కేంద్ర ప్రభుత్వం చర్య నేచురల్ జస్టిస్, రాజ్యాంగానికి విరుద్ధం అని అన్నారు. సెలెబి ఏవియేషన్ కు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా భద్రతా అనుమతి రద్దు చేశారని అన్నారు. అయితే సీనియర్ అడ్వకేట్ ముఖుల్ రోహత్గి వాదనలను సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తప్పుబట్టారు. దేశ భద్రత దృష్ట్యా తీసుకున్న నిర్ణయాలపై వాదోపవాదాలు అనవసరం అని అన్నారు. దేశం ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంలో తప్పు లేదని పేర్కొన్నారు.

అయితే ఇరువురి వాదనలు విన్న దిల్లీ హైకోర్టు సెలెబి ఏవియేషన్ సంస్థ పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో టర్కీకి భారత్ మరోసారి బుద్ధి చెప్పినట్లుగా భావించవచ్చు. అయితే టర్కీ భారత్ చేసిన సాయాన్ని మరచిపోయి ప్రవర్తించింది. 2023లో టర్కీలో భారీ భూకంపం సంభవించి.. పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. ఆ సమయంలో అన్ని ప్రపంచ దేశాల కంటే ముందు టర్కీకి సాయం చేసిన దేశం భారత్. కానీ టర్కీ మాత్రం ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్ కు సపోర్ట్ చేసింది.
Delhi HC junks Turkey-based Celebi's pleas against revocation of its security clearance by aviation watchdog BCAS. pic.twitter.com/DmGCPTcBfM
— Press Trust of India (@PTI_News) July 7, 2025
దీంతో బాయికాట్ టర్కీ నినాదం సామాజిక మాధ్యమాల్లో ఇటీవల హోరెత్తింది. ఏటా భారత్ నుంచి వేల మంది పర్యాటకులు టర్కీ అందాలను వీక్షించేందుకు వెళ్తుంటారు. అయితే పాకిస్థాన్ కు మద్దతుగా నిలిచింది టర్కీ. ఈ క్రమంలో మన ట్రావెల్ ఏజెన్సీలు టర్కీ ఆన్‌లైన్ బుకింగ్‌లను నిలిపివేస్తున్నట్లు గతంలో ప్రకటించాయి. దీంతో టర్కీ పర్యాటకరంగంపై తీవ్ర ప్రభావం పడింది. అంతేకాక దిల్లీలోని ప్రఖ్యాత జేఎన్‌యూ కీలక ప్రకటన చేసింది. టర్కీలోని ఇనొను యూనివర్సిటీతో కుదుర్చుకున్న ఒప్పందం (ఎంవోయూ) ను నిలిపేస్తున్నట్లు పేర్కొంది.












Click it and Unblock the Notifications