సర్ఫేజ్-ఎయిర్: లాంగ్ రేంజ్ క్షిపణి ప్రయోగం విజయవంతం

బాలాసోర్‌: భారత్ మరో క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. ఉపరితలం నుంచి గగనతలంలో లక్ష్యాలు ఛేదించగల లాంగ్‌ రేంజ్‌ క్షిపణిని మంగళవారం విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశా తీరంలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌(ఐటీఆర్) నుంచి ఈ క్షిపణి ప్రయోగం చేసినట్లు డీఆర్‌డీఓ అధికారులు వెల్లడించారు.

కాగా, ఈ క్షిపణిని ఇజ్రాయెల్‌, భారత్‌ సంయుక్తంగా రూపొందించాయి. లాంగ్‌ రేంజ్‌ క్షిపణి ప్రయోగం విజయవంతమైందని.. త్వరలో మరిన్ని విడతల్లో ఈ క్షిపణిని ప్రయోగిస్తామని అధికారులు తెలిపారు. ఈ క్షిపణిలో మల్టీ ఫంక్షనల్‌ సర్వైలెన్స్‌ అండ్‌ త్రెట్‌ అలర్ట్‌ రాడార్‌(ఎంఎఫ్‌-ఎస్‌టిఏఆర్) సిస్టమ్‌ ఉంటుంది.

భారత్‌, ఇజ్రాయెల్‌ రూపొందించిన ఉపరితలం నుంచి గగనతలంలో లక్ష్యాలను ఛేదించే మీడియం రేంజ్‌ క్షిపణిని డీఆర్‌డీఓ జూన్‌ 30- జులై 1 మధ్య వరసగా మూడుసార్లు విజయవంతంగా ప్రయోగించింది.

నిరుడు ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా వాహక నౌకపై నుంచి కూడా ఉపరితలం నుంచి గగనతలంలో లక్ష్యాలను ఛేదించే లాంగ్‌రేంజ్‌ క్షిపణి(ఎల్‌ఆర్‌-ఎస్‌ఏఎం)ని విజయవంతంగా ప్రయోగించారు. కాగా, తాజాగా ఈ క్షిపణి విజయవంతం పట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హర్షం వ్యక్తి చేస్తూ.. డీఆర్డీవో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+