వైరస్ కాటుకు లక్ష మంది బలి - దేశంలో కరోనా మరణాల రికార్డు

అలా చూస్తూ ఉండగానే.. ఆరు నెలల వ్యవధిలో మొత్తం లక్ష మంది భారతీయుల్ని కరోనా మహమ్మారి పొట్టనపెట్టుకుంది. దేశంలో కరోనా మరణాలకు సంబంధించి శుక్రవారం రాత్రి మరో రికార్డు నమోదు కావడం విషాదకరం. ఇప్పటిదాకా కొవిడ్-19తో చనిపోయిన వారి సంఖ్య 1లక్ష మార్కును దాటింది.

కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం ప్రకటించిన లెక్కల ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 81,484 కేసులు, 1095 మరణాలు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 63.94 లక్షలకు, మరణాల సంఖ్య 99,773కు పెరిగింది. అయితే, శుక్రవారం సాయంత్రానికి వివిధ రాష్ట్రాల నుంచి కొత్త డేటా వచ్చి చేరడంతో మొత్తం మరణాల సంఖ్య 1లక్ష మార్కును దాటి.. 1, 00,343కు పెరిగింది.

India surpasses grim milestone of 1 lakh coronavirus deaths

శుక్రవారం సాయంత్రానికి మొత్తం కేసుల సంఖ్య 64.48లక్షలకు పెరగ్గా, 83 శాతం రికవరీ రేటుతో సుమారు 54 లక్షల మంది కొవిడ్-19 వ్యాధి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 9.49లక్షలుగా ఉంది.

కరోనా కేసుల సంఖ్యతోపాటు మరణాల్లోనూ మహారాష్ట్ర టాప్ లో కొనసాగతున్నది. అక్కడ కేసుల సంఖ్య 14 లక్షలు, మరణాల సంఖ్య 37వేలు దాటాయి. రెండో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో 7లక్షల కేసులు, 5900 మరణాలు నమోదయ్యాయి. కర్ణాటకలో 9,119 మంది, తమిళనాడులో 9653 మంది, ఉత్తరప్రదేశ్ లో 5917 మంి ఢిల్లీ 5438, వెస్ట్ బెంగాల్ 5070, గుజరాత్ 3478, తెలంగాణలో 1145 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+