వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సొంత సాంకేతికత: నిర్భయ్ క్షిపణి ప్రయోగం సక్సెస్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత దేశ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన సబ్‌‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి 'నిర్బయ్'ను డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్‌‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ మిస్సైల్ టెస్ట్ రేంజ్‌లో నిర్భయ్ ప్రయోగం జరిగింది. అణ్వస్త్రాలను మోసుకుపోగల సామర్ద్యం నిర్భయ్ క్షిపణికి ఉంది.

ఈరోజు ఉదయం 10:04 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లిన సబ్‌‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి 'నిర్బయ్' 800 మీటర్లకు చేరుకుని.. తిరిగి బంగాళాఖాతం వైపుకి చేరుకుంది. ఉదయం 11 గంటల ప్రాంతంలో డీఆర్డీవో ప్రతినిధులు క్షిపణి విజయవంతమైనట్లు ప్రకటించారు.

నిర్భయ్ క్షిపణికి గాల్లోనూ, భూమ్మీద నుంచి, ఓడలు, జలాంతర్గాములు నుంచి కూడా ప్రయాణించే సామర్ద్యం కలదు. గగనతలం నుంచి ప్రయోగించే క్షిపణిని కూడా అభివృద్ది చేస్తున్నట్లు డీఆర్డీవో అధిపతి అవినాశ్ చందర్ తెలిపారు.

 India test-fires indigenously developed N-capable 'Nirbhay' cruise missile

నిర్భయ్ క్షిపణి తయారీలో హైదరాబాద్‌కు చెందిన రక్షణ ప్రయోగశాల కీలక పాత్ర వహించిందని క్షిపణి తయారీలో పాలుపంచుకున్న సైంటిస్ట్ సతీష్ రెడ్డి ఓ ప్రముఖ తెలుగు వార్తా పత్రికకు తెలిపారు.

అమెరికా దగ్గరున్న క్షిపణుల కంటే నిర్భయ్ చాలా మేలైనదని అన్నారు. సముద్రం అలలపై నుంచి 5 మీటర్ల ఎత్తులో కూడా ప్రయాణించగలదన్నారు. వెయ్యి కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని చేధించగలదని, 16 పాయింట్లను టచ్ చేసుకుంటూ క్షిపణి తన గమ్యస్దానాన్ని చేరుకుంటుందని తెలిపారు.

700 కిలోమీటర్ల లక్ష్యాలను ఈ క్షిపణి చేధించగలదు. ఎక్కువ ఎత్తులో ఎగురుతూ రాడార్‌కు దొరక్కుండా ప్రయాణించడం ఈ క్షిపణి ప్రత్యేకత. ఈ క్రూయిజ్ క్షిపణిని బెంగుళూరులోని సివి రామన్ నగర్‌లో ఉన్న ఏరోనాటికల్ డెవెలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్‌లోని ప్రాధమిక లాబొరేటరీలో రూపొందించారు.

నిర్బయ్ పేరుతో రూపొందించిన రెండవ క్షిపణి ఇది. మొదటి నిర్బయ్ మిసైల్ మార్చి 12, 2013న ప్రయోగించాల్సి ఉన్నా.. సాంకేతిక కారణంగా రద్దు చేశారు.

నిర్బయ్ క్షిపణి విశేషాలు:
పేరు: నిర్బయ్
అర్దం: భయంలేని
రకం: రెండు వేదికల సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి
రేంజి: 800-1000 కిమీ
పొడవు: 6 మీటర్లు
వ్యాసం: 0.52మీ
స్పాన్: 2.7 మీ
బరువు: 1,500 కిలోలు
స్పీడ్: 0.7 మాక్
శక్తి సామర్ద్యాలు: బహుళ యుక్తులు, ఇంటెంట్ లక్షణాలు
ఖర్చు: సుమారుగా రూ. 10 కోట్లు
రూపొందించిన వారు: ADE బెంగుళూరు

English summary
India on Friday test-fired the indigenously developed sub-sonic long-range cruise missile 'Nirbhay' from the Integrated Test Range at Chandipur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X