జైడస్ క్యాడిలా ఒక్క డోసు ధర రూ. 265: కోటి డోసులు ఆర్డర్ చేసిన భారత్
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జైడస్ క్యాడిలా రూపొందించిన కరోనా టీకా జైకోవ్ డీ.. కోటి డోసుల కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ చేసింది. అయితే, మూడు డోసుల్లో తీసుకోవాల్సిన ఈ టీకాను కేంద్ర ప్రభుత్వానికి ఒక డోసుకు రూ. 265కు ఇచ్చేందుకు జైడస్ క్యాడిలా అంగీకరించినట్లు ఆ సంస్థ తెలిపింది.
కాగా, సూది(Needle) అవసరం లేకుండానే పంపిణీ చేసే ఈ టీకా కోసం ప్రత్యేకంగా ఓ పరికరాన్ని వాడనున్నారు. దీని ధర రూ. 93 కలుపుకుని(జీఎస్టీ కాకుండా) జైకోవ్-డీ ఒక డోసు ధర రూ. 358 అవుతుందన్నారు. కేంద్రంతో సంప్రదించిన తర్వాతే ఈ ధరను నిర్ణయించినట్లు జైడస్ క్యాడిలా ఓ ప్రకటనలో వెల్లడించింది. 12 ఏళ్ల వయసు పైబడిన పిల్లల కోసం అనుమతి పొందిన తొలి టీకాగా జైకోవ్-డీ నిలిచింది. అయితే, ఈ టీకాను మూడు డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుంది.

కాగా, సూది అవసరం లేకుండా మూడు డోసుల్లో ఇచ్చే జైకోవ్-డీ టీకాను 12 ఏళ్ల వయసుపైబడినవారికి ఇచ్చేందుకు ఆగస్టు 20వ తేదీనే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఒక్కో డోసును 28 రోజుల వ్యవధి చొప్పున తీసుకోవాల్సి ఉంటుంది. గుజరాత్ రాష్ట్రానికి చెందిన జైడస్ క్యాడిలా రూపొందించిన ఈ టీకా.. ప్రపంచంలోనే అనుమతి పొందిన డీఎన్ఏ ఆధారిత తొలి కరోనా టీకాగా నిలవడం గమనార్హం.
Recommended Video
ఒక్కో డోసు ఖరీదు రూ. 265 కాగా, జెట్ అప్లికేటర్‌కు రూ. 93, 5 శాతం జీఎస్టీ(రూ.18) అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇలా మూడు డోసులకు మొత్తం రూ. 1900కు అందజేస్తామని జైడస్ క్యాడిలా ప్రతిపాదించింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న టీకాలతో పోలిస్తే జైడస్ ధర ఎక్కువగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం ఆ సంస్థతో సంప్రదింపులు జరిపింది. దీంతో చివరకు ఒక డోసును రూ. 265కు ఇచ్చేందుకు జైడస్ అంగీకరించినట్లు తెలుస్తోంది. సూది లేకుండా వాడిపారేసే జెట్ అప్లికేటర్ ను వినియోగించనున్నందున దీని ధర రూ. 93 కలుపుకుని ఒక డోసు ధర రూ. 358 అవుతుంది.












Click it and Unblock the Notifications