Exit Polls 2024: స్వామియే శరణం అయ్యప్ప, కేరళ కుట్టీలు ఆ పార్టీకి జై, మోదీ, రాహుల్ ?

లోక్‌సభ ఎన్నికల ఏడు దశలు ముగియడంతో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎగ్జిట్ పోల్ అంచనాలు వెలువడుతున్నాయి. వివిధ ఏజెన్సీల సహకారంతో జాతీయ మీడియా సంస్థలు చేస్తున్న ఎగ్జిట్ పోల్స్ బయటకు వస్తున్నాయి. జాతీయ స్థాయిలో ప్రధాని నరేంద్ర మోదీయే అధికారంలోకి వస్తారని అన్ని సర్వేలు చెబుతున్నాయి. కేంద్రంలో మరోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని అందరూ అంచనా వేస్తున్నారు.

ఇండియా టుడే - యాక్సిస్ మై ఇండియా సర్వే ఫలితాలు విడుదల చేశారు. దక్షిణ భారతదేశంలో బీజేపీ ఖాతా తెరవాలి అని ప్రయత్నిస్తున్న నాయకులు, బీజేపీకి కేరళ ప్రజలు గుడ్ న్యూస్ చెబుతున్నారు. కేరళ విషయానికి వస్తే లోక్ సభ ఎన్నికల్లో గతంలో కంటే యూడీఎఫ్ పార్టీ పురోగతి సాధిస్తుందని ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా సర్వే పేర్కొంది. మరీ ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో బీజేపీ తొలిసారిగా లోక్‌సభ సీటును గెలుచుకుంటుందని అంచనా వేసింది.

India Today Axis My India survey says that UDF is likely to win 17 to 18 seats and BJP two to three seats in Kerala

ఇండియా టుడే సర్వే ప్రకారం యూడీఎఫ్ 17 నుంచి 18 సీట్లు గెలుచుకోవచ్చు. అంటే ఈసారి కూడా అలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని వెలుగు చూసింది. 2019లో యూడీఎఫ్ 19 సీట్లు గెలుచుకుంది. కోజికోడ్, వయనాడ్ లో 2019 లోక్ సభ ఎన్నికలకు భిన్నంగా ఫలితాలు వెలువడే అవకాశం ఉందని సర్వే తెలిపింది. ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా ఈసారి అధికార ఎల్‌డీఎఫ్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగులుతుందని అభిప్రాయపడింది.

ఎల్‌డీఎఫ్‌కు గరిష్టంగా ఒక సీటు మాత్రమే గెలుస్తుందని సర్వే అంచనా వేసింది. ఇది సున్నాకి కూడా పడిపోవచ్చు అని సర్వే తెలిపింది. అలా అయితే ఎల్‌డీఎఫ్‌కు తీవ్ర ఎదురుదెబ్బగా పరిణమించవచ్చు. ఇక బీజేపీ విషయానికి వస్తే కేరళలో ఈసారి కొత్త చరిత్ర సృష్టిస్తారు. రెండు మూడు సీట్లు గెలిచే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా సర్వే ప్రకారం కేరళలో బీజేపీ ఓట్ల శాతం పెద్ద ముందడుగు వేయవచ్చని అంచనా వేసింది. ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం కేరళలో ఎన్డీఏ ఖాతా తెరుస్తుందని వెలుగు చూసింది మొత్తం మీద కేరళ ప్రజలు బీజేపీని ఆధరిస్తున్నారని వెలుగు చూడటంతో ఆ పార్టీలోని నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+