Nimisha Priya: కేరళ నర్సు కేసులో భారత్ చేయగలిగిందేమీ లేదు:కేంద్రం
Nimisha Priya: యెమెన్‌లో కేరళకు చెందిన నర్స్ నిమిష ప్రియను రక్షించే మరో ఆశ కనుమరుగు అవుతోంది. ఈ విషయంలో తాము పెద్దగా ఏమీ చేయలేమని సోమవారం ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. జూలై 16న నిమిషకు యెమెన్‌లో మరణశిక్ష అమలు చేయవచ్చు. తలాల్ అబ్దు మెహదీ అనే యెమెన్ పౌరుడి హత్య కేసులో ఆమె దోషిగా తేలింది.
కేరళకు చెందిన నర్స్ నిమిష ప్రియకు యెమెన్‌లో ఉరిశిక్ష పడకుండా కేంద్రం కలగజేసుకోవాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌పై ప్రభుత్వ కౌన్సిల్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించింది. విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అన్ని సాధ్యమైన చర్యలు ఇప్పటికీ తీసుకున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. యెమెన్‌తో మాట్లాడటానికి ఒక నిర్దిష్ట పరిమితి ఉందని.. ఆ పరిమితికి మించి ఏమీ చేయలేమని కేంద్రం వెల్లడించింది. నేడు ఉదయం 10:30 గంటలకు కూడా ఉరిశిక్షను వాయిదా వేయడానికి సంబంధించి చర్చ జరిగిందని, అయితే ఉరిశిక్షను వాయిదా వేయడానికి యెమెన్ అంగీకరించడం లేదని ప్రభుత్వం తెలిపింది. ఉరిశిక్షను ఆపేందుకు ఇప్పుడు భారత్ వద్ద పెద్దగా మార్గాలేవీ మిగిలి లేవని కేంద్రం పేర్కొంది. యెమెన్ పౌరుడి కుటుంబం బ్లడ్ మనీని అంగీకరించడానికి సిద్ధంగా ఉండటమే ఇప్పుడు ఏకైక మార్గం అని తెలిపింది భారత్-యెమెన్ ల మధ్య దౌత్యపరమైన సంబంధాలు లేవని.. కేంద్రం ఏం చేయగలదో అన్ని చేసిందని.. ఇక కేంద్రం కూడా ఏం చేయలేదని అటార్నీ జనరల్ వెంకటరమణి కోర్టుకు తెలిపారు.

అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి వాదనలు వినిపిస్తూ.. "ఈ విషయంలో భారతదేశం ఇంతకు మించి ముందుకు వెళ్లలేదని, ప్రభుత్వం ఆ పరిమితికి చేరుకుంది.ప్రభుత్వం పెద్దగా ఏమీ చేయలేదు. యెమెన్ సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటే, అది దౌత్యపరంగా గుర్తించబడలేదు. బ్లడ్ మనీ ఒక ప్రైవేట్ ఒప్పందం" అని ఆయన అన్నారు.
ఏమిటి బ్లడ్ మనీ?
సులభమైన భాషలో చెప్పాలంటే, బ్లడ్ మనీ అంటే దోషి తరపున బాధితుడి కుటుంబానికి ఇచ్చే ఆర్థిక పరిహారం. ముఖ్యంగా, అనుకోకుండా జరిగిన హత్యల కేసులలో ఇది జరుగుతుంది. ఆ తర్వాత బాధితుడి కుటుంబం దోషిని క్షమించాలా వద్దా అనేది వారిపై ఆధారపడి ఉంటుంది. మృతుడి కుటుంబానికి పరిహారంగా కొంత మొత్తాన్ని చెల్లిస్తే నిందితులను క్షమించి వదిలేసే అవకాశం యెమెన్‌లో ఉంది.దీంతో ప్రియ కుటుంబానికి రూ.8.6 కోట్లను బాధిత కుటుంబానికి ఇచ్చేందుకు కూడా సిద్ధమైనట్లు తెలిసింది. కానీ అటువైపు(బాధిత కుటుంబం) నుంచి నుంచి ఎలాంటి స్పందన రాలేదని సమాచారం.
అసలేం జరిగిందంటే?
కేరళకు చెందిన నిమిష ప్రియ 2011లో నర్సుగా పనిచేసేందుకు తన భర్త, కుమార్తెతో కలిసి యెమెన్‌కు వెళ్లింది. ఆదేశ రాజధాని సనాలో నర్సుగా ఉద్యోగం చేసేది.క్రమంగా వారి కుటుంబానికి ఆర్థిక కష్టాలు వచ్చాయి.దీంతో 2014లో ప్రియా భర్త కూతురు ఇద్దరూ భారత్‌కు తిరిగి వచ్చారు. అయితే ప్రియా మాత్రం యెమెన్‌లోనే ఆగిపోయింది. ఇక యెమెన్‌లో అంతర్యుద్ధం కారణంగా ప్రియా తన భర్త కూతురితో కలిసింది లేదు.ఇక తన బతుకుదెరువు కోసం యెమెన్‌లోనే తలాల్ అబ్దో మెహదీ అనే మరో వ్యక్తితో కలిసి ఒక క్లినిక్‌ను ప్రారంభించింది. ఇక్కడే అసలైన ట్విస్ట్ చోటు చేసుకుంది.
మెహదీ కొన్ని డాక్యుమెంట్లను మానిపులేట్ చేసి ప్రియా తన భార్యగా అందులో చేర్చాడు. ఆ తర్వాత మెహదీ తనను శారీరకంగా, మానసికంగా వేధించేవాడని ఎమోషనల్ బ్లాక్‌మెయిల్‌కు గురిచేసేవాడని ప్రియా చెప్పుకొచ్చింది. తనను చిత్రహింసలకు గురిచేసేవాడని పేర్కొంది.అంతేకాదు తన పాస్‌పోర్టును కూడా మెహదీ లాగేసుకున్నాడని వెల్లడించింది. తన క్లినిక్ పై వచ్చే డబ్బులు మొత్తాన్ని ఇవ్వాలని టార్చర్ పెట్టేవాడని, డ్రగ్స్ కూడా ఇచ్చేవాడని తెలిపింది. స్థానిక పోలీస్ స్టేషన్‌లో కూడా తాను ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది.అయితే మెహదీ చర్యలు తీసుకోవడం పోయి, పోలీసులు తనను అరెస్టు చేసినట్లు వెల్లడించింది ప్రియా.
2017లో తాను అనుభవిస్తున్న ఈ నరకం నుంచి తప్పించుకుని మెహదీ వద్ద ఉన్న తన పాస్‌పోర్టు ఎలాగైనా దక్కించుకోవాలని భావించిన ప్రియా, స్థానిక జైలు వార్డన్ సహాయంతో పాటు సలహా కోరింది. దీంతో మహ్దికి క్రమంగా మత్తు మందునిచ్చి నిస్సహాయుడిని చేయాలని ఆ జైలు వార్డన్ సలహా ఇచ్చాడు. దీంతో ప్రియా ఆపని ప్రారంభించింది. మహ్దికి మత్తు మందు ఇవ్వడం ప్రారంభించింది. అది కాస్త ఓవర్ డోస్‌గా మారి మెహదీ ప్రాణాలు తీసింది.ఆ తర్వాత ఏం చేయాలో తోచక మెహదీ శరీరాన్ని ముక్కలుగా చేసి ఓ ట్యాంకులో పడేసింది. చివరికి అక్కడి నుంచి సౌదీకి వెళ్లిపోతుండగా.. సరిహద్దుల్లో ఆమెను అరెస్ట్ చేశారు. నిందితురాలని కోర్టులో ప్రవేశపెట్టగా తనను చిత్రహింసలకు గురిచేశాడని మహ్ది దగ్గరున్న పాస్‌పోర్టును తిరిగి తీసుకునేందుకే ఇలా చేసినట్లు ప్రియా ఒప్పుకుంది.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications