భారత్-అమెరికా డీల్ రచ్చ: అసలు నిజాలను బయటపెట్టిన పీయూష్ గోయల్!

భారత్, అమెరికా దేశాల మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం ప్రస్తుతం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఒప్పందంపై లోక్‌‌సభలో విపక్షాలు చేస్తున్న విమర్శలకు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సమాధానమిస్తూ.. ఇది దేశభవిష్యత్తును మార్చే "ఫ్యూచర్ డిఫైనింగ్ డీల్" అని అభివర్ణించారు.

విపక్షాల విమర్శలు.. ప్రభుత్వంపై ఒత్తిడి
ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఇతర విపక్ష నేతలు ఈ ఒప్పందంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధానంగా మూడు అంశాలపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. భారత సర్కారు అధికారిక ప్రకటన చేయకముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ డీల్ గురించి వెల్లడించడాన్ని విపక్షాలు ప్రశ్నించాయి. అమెరికా నుంచి పాల ఉత్పత్తులు, వ్యవసాయ వస్తువుల దిగుమతి పెరగడం వల్ల భారతీయ రైతులు, డెయిరీ రైతులు నష్టపోతారని ఆరోపించారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గించి, అమెరికా చెప్పినట్టు వెనెజులా నుంచి చమురు కొనడానికి ఒప్పుకోవడం దేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టడమేనని విమర్శించారు.

India-US Trade Deal Piyush Goyal Counters Opposition Claims in Lok Sabha Full Details

విపక్షాల ప్రశ్నలకు పీయూష్ గోయల్ చెక్!

విపక్షాల ఆరోపణలను కొట్టిపారేస్తూ పీయూష్ గోయల్ లోక్‌సభలోనూ.. బయట మీడియా సమావేశంలోనూ కీలక వివరణలు ఇచ్చారు. అమెరికా భారత్ పై విధిస్తున్న సుంకాలను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించిందని, దీనివల్ల భారతీయ వస్త్ర, ఫార్మా, జెమ్స్ అండ్ జ్యువెలరీ రంగాలకు భారీగా ఎగుమతి అవకాశాలు లభిస్తాయని ఆయన చెప్పారు.వ్యవసాయం, డెయిరీ రంగాలను ప్రభుత్వం పూర్తిగా కాపాడిందని ఆయన స్పష్టం చేశారు. గతంలో RCEP ఒప్పందం నుంచి తప్పుకున్నట్లే.. భారతీయ రైతుల ప్రయోజనాలకు భంగం కలిగే ఏ ఒప్పందానికి ప్రధాని మోదీ అంగీకరించరని గుర్తుచేశారు.అమెరికా తన సుంకాలను తగ్గించుకుంటోంది కాబట్టి, ఆ దేశమే ముందుగా ప్రకటించడం సహజమని, త్వరలోనే ఇరు దేశాల ఉమ్మడి ప్రకటన వస్తుందని పీయూష్ గోయల్ వెల్లడించారు.

మేకిన్ ఇండియాకు కొత్త ఊపిరి
ఈ ఒప్పందం కేవలం ఎగుమతులకు మాత్రమే పరిమితం కాకుండా, అమెరికా నుంచి అత్యున్నత సాంకేతికతను భారత్‌కు తీసుకురావడానికి దోహదపడుతుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వివరించారు. దీనివల్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (MSME) అంతర్జాతీయ మార్కెట్లు అందుబాటులోకి వస్తాయని, 'వికసిత్ భారత్ 2047' లక్ష్యానికి ఇది మైలురాయి అని ఆయన పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+