ఆ విదేశీయులు భారత్ లోకి నో ఎంట్రీ.. కేంద్రం సంచలన నిర్ణయం
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారెనర్స్ యాక్ట్- 2025 ప్రకారం.. పాస్ పోర్టులు, వీసా రూల్స్, ఇమ్మిగ్రేషన్ విధానంలో కీలక మార్పులు చేసింది. వివిధ దేశాల్లో గూఢచర్యం, అత్యాచారం, హత్య, ఉగ్రవాదం, పిల్లల అక్రమ రవాణా.. తదితర కేసుల్లో అభియోగాలు ఉన్న ఉన్నవారిని దేశంలోకి రానివ్వబోమని స్పష్టం చేసింది. అలాగే దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి దోషులుగా తేలిన వారిని కూడా భారత్ లోకి అనుమతి లేకుండా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. తాజాగా తీసుకొచ్చిన ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారెనర్స్ చట్టం ఏప్రిల్ 4 న చట్టంగా మారింది. తాజాగా ఈ యాక్ట్ అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
వలసవాదులు, విదేశీయులపై కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఫోర్జింగ్, నకిలీ పాస్ పోర్టు లేదా వీసాలతో భారత్ లోకి ప్రవేశిస్తే కఠిన శిక్షలు విధించనున్నట్లు పేర్కొంది. వారికి గరిష్టంగా 7 సంవత్సరాలు జైలు శిక్ష అలాగే రూ. 10 లక్షలు జరిమానా విధించనున్నట్లు స్పష్టం చేసింది. అలాగే ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారెనర్స్ యాక్ట్ 2025 చట్టం ప్రకారం భారత్ లోకి ప్రవేశించిన విదేశీయుల వివరాలను సంబంధిత హోటల్స్, యూనివర్సిటీలు, విద్యాసంస్థలు, ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్స్ కేంద్ర ప్రభుత్వానికి అందించాలని సూచనలు చేసింది.
అలాగే ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారెనర్స్ యాక్ట్ 2025 ప్రకారం దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే విదేశీయులకు నో ఎంట్రీ చెప్పింది. దాంతోపాటు గూఢచర్యం, అత్యాచారం, హత్య, ఉగ్రవాద చట్టాలు, పిల్లల అక్రమ రవాణా, నిషేధిత సంస్థల్లో సభ్యులుగా ఉన్నవారిని దేశంలోకి రానివ్వమని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నూతన చట్టం ప్రకారం రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకోవాలని సూచనలు చేసింది. ఈ మేరకు ప్రత్యేక తనిఖీ కేంద్రాలు, నిర్భంద క్యాంపులు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది.

అంతేకాక ట్రెక్కింగ్ కోసం భారత్ కు వచ్చే విదేశీయులపైనా కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ముందస్తు అనుమతి లేకుండా విదేశీ పౌరుడు లేదా విదేశీ గ్రూపు దేశంలోని ఏ పర్వతాన్ని కూడా ఎక్కేందుకు ప్రయత్నించకూడదని తేల్చి చెప్పింది. అంతేకాక విదేశీ పౌరుడు ఏదైనా నిషేధిత ప్రాంతంలోకి ప్రవేశించడానికి లేదా ఉండేందుకు అనుమతి పొందాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications