Hampi: భారీ బందోబస్తుతో కర్ణాటక చేరుకున్న వెంకయ్యనాయుడు, ఆర్మీ హెలికాప్టర్, తుంగభద్రా, హంపీలో !
బెంగళూరు/ బళ్లారి/ హంపి: భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు కుటుంబ సభ్యులతో కలిసి కర్ణాటక చేరుకున్నారు. ఆర్మీకి చెందిన ప్రత్యేక హెలికాప్టర్ లో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి హుబ్బళి ఎయిర్ పోర్టు నుంచి హోస్ పేట చేరుకున్నారు. కర్ణాటక మంత్రి ఆనంద్ సింగ్ తదితరులు వెంకయ్యనాయుడి కుటుంబ సభ్యులకు స్వాగతం పలికారు. హెలిప్యాడ్ నుంచి కారులో జీరో ట్రాఫిక్ మార్గంలో వెంకయ్య నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి తుంగభద్రా డ్యామ్ దగ్గరకు చేరుకున్నారు. ముందుగా నిర్ణయించిన సమయం కంటే వెంకయ్యనాయుడు 20 నిమిషాల ముందే హోసపేట చేరుకున్నారు. శనివారం వెంకయ్యనాయుడు కుటుంబ సభ్యులతో కలిసి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన హంపీ సందర్శించనున్నారు. ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పర్యటన సందర్బంగా కర్ణాటక పోలీసు అధికారులు కట్టుదిట్టమైన భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

రెండు రోజుల పర్యటన
భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, ఆయన సతీమణి ఉషాతో పాటు వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో శుక్రవారం కర్ణాటకలోని హుబ్బళి ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. హుబ్బళి ఎయిర్ పోర్టు నుంచి ఆర్మీకి చెందిన ప్రత్యేక హెలికాప్టర్ లో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆయన కుటుంబ సభ్యులు హోస్ పేట్ చేరుకున్నారు. రెండు రోజుల పాటు ఎం. వెంకయ్యనాయుడు, ఆయన కుటుంబ సభ్యులు కర్ణాటక పర్యటనలో ఉంటారని అధికారులు తెలిపారు.

తుంగభద్రా డ్యామ్ పరిశీలించిన వెంకయ్యనాయడు
కర్ణాటక మంత్రి ఆనంద్ సింగ్ తదితరులు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఆయన కుటుంబ సభ్యులకు స్వాగతం పలికారు. హోస్ పేట్ (విజయనగరం)లోని హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గంలో కారులో జీరో ట్రాఫిక్ మార్గంలో వెంకయ్య నాయుడు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తుంగభద్రా డ్యామ్ దగ్గరకు చేరుకున్నారు. వర్షపు నీటితో కలకలలాడుతున్న తుంగభద్రా డ్యామ్ చూసిన ఎం. వెంకయ్యనాయుడు, ఆయన కుటుంబ సభ్యులు సంతోషంతో పులకించిపోయారు. వెంకయ్యనాయుడి పర్యటన సందర్బంగా తుంగభద్రా డ్యామ్ అన్ని వైపుల సామాన్య ప్రజలు సంచరించుకుండా పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు.

ఫ్యామిలీతో హంపీ పర్యటన
శనివారం ఉదయం 10 గంటలకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబ సభ్యులతో కలిసి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన హంపీ సందర్శించనున్నారు. ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పర్యటన సందర్బంగా కర్ణాటక పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హంపీలో వెంకటయ్యనాయుడు కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా బ్యాటరీ వాహనాలు ఏర్పాటు చేశారు. వెంకయ్యనాయుడి పర్యటన సందర్బంగా హంపీని సుందరంగా తీర్చిదిద్దారు. శనివారం వెంకయ్యనాయుడి పర్యటన ముగిసే వరకు హింపీలోని అనేక ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు జారీ చేశారు.

భారీబందోబస్తు
ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పర్యటన సందర్బంగా కర్ణాటక పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హోసపేట్, కోప్పళ తదితర జిల్లాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వెంకయ్యనాయుడు పర్యటించే రోడ్డు మార్గాలు అన్ని పోలీసుల మయం అయిపోయాయి. కమలాపురలోని టూరిజం శాఖకు చెందిన మయూర భువనేశ్వరి హోటల్ లో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఆయన కుటుంబ సభ్యులు బస చెయ్యడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రెండు రోజుల పాటు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఆయన కుటుంబ సభ్యుల కోసం ఉత్తర కర్ణాటక వంటలు, ఆంధ్రా శైలి వంటలు తయారు చేయిస్తున్నారు.












Click it and Unblock the Notifications