వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ - పాక్ మ్యాచ్ మేనియా : బెట్టింగ్ ల హోరు- కళ్లు చెదిరే లెక్కలు..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

క్రికెట్ మేనియా దేశాన్ని ఊపేస్తోంది. ఆదివారం..అందునా భారత్ - పాకిస్థాన్ టీ20 మ్యాచ్. అంతే ఉదయం నుంచే ఈ మ్యాచ్ ల పైన విశ్లేషణలు...అంచనాలు..స్పందనలతో మొత్తంగా ఈ మ్యాచ్ ఈ రోజున స్పెషల్ ఆఫ్ ది డే గా మారిపోయింది. ఇక, ఈ మ్యాచ్ ను క్యాష్ చేసుకొనేందుకు కొందరు రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. మ్యాచ్ పైన ఉండే అంచనాలు..వారి భావోద్వేగాలను అనుకూలంగా మలచుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆన్ లైన్ వేదికగా బెట్టింగ్ నిర్వహణ మొదలు పెట్టారు.

ఆన్ లైన్ బెట్టింగ్స్ హోరు

ఆన్ లైన్ బెట్టింగ్స్ హోరు

శనివారం ఆస్ట్రేలియా - దక్షిణాఫ్రికా మ్యాచ్ మధ్య కూడా టెలిగ్రాం ఇన్స్‌టాగ్రాంలలో బెట్టింగ్ జరిగింది. మ్యాచ్ ప్రారంభానికి ముందే టాస్ తో మొదలు పెడితే..ఫస్ట్‌బాల్‌ నుంచి లాస్ట్‌బాల్‌ వరకు బెట్టింగ్‌లకు ప్లాన్‌ చేశారని సమాచారం. ఎవరు ఎంత కొడతారు..ఎన్ని బంతుల్లో చేస్తారు.. ఎవరు ఎన్ని వికెట్లు తీస్తారు అనేదానిపై కూడా రేటు ఫిక్స్‌ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టీమిండియా స్టార్‌ ఓపెనర్లు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, యువ సంచలనం రిషభ్‌ పంత్‌పైనే ఎక్కువ బెట్టింగ్‌లు వేస్తున్నట్లు తెలుస్తోంది.

కళ్లు చెదిరే లెక్కలతో

కళ్లు చెదిరే లెక్కలతో

పాకిస్థాన్ జట్టు వరల్డ్ కప్ చరిత్రలో భారత్ ను ఒక్కసారి కూడా ఓడించిన దాఖలాలేవు. దీంతో ఈసారి కూడా ఇదే సీన్ రిపీట్ చేయాలని టీంఇండియా ఉవ్విళ్లురుతోంది. మరోవైపు పాకిస్థాన్ మాత్రం గతం గతః అని ఈసారి విజయం తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తోంది. పాక్ పై వెయ్యికి రూ.1,600లు.. పాక్ పై వెయ్యికి రూ.500 నుంచి 800 వరకు ఆన్ లైన్ బెట్టింగ్ నడుస్తోందని సమాచారం. ఇక ఈ మ్యాచుల కోసం ప్రముఖ రెస్టారెంట్స్, హోటళ్లు పెద్ద స్కీన్ లను ఏర్పాటు చేస్తూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

బాల్ టు బాల్... ఎవరెన్ని పరుగులు చేస్తారు

బాల్ టు బాల్... ఎవరెన్ని పరుగులు చేస్తారు

టాస్ గెలిచిన జట్టు ఆధారంగా కూడా బెట్టింగ్ మారే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక 2017 ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో భారత్-పాకిస్తాన్ జట్లు తలపడగా.. అప్పుడు రెండువేల కోట్ల బెట్టింగ్ జరిగిందని టాక్. అయితే నేటి మ్యాచ్ ఆ రికార్డును బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువని ప్రచారం జరుగుతోంది. ప్రత్యక్షంగా కాకుండా ఎవరికీ చిక్కకుండా ప్రత్యేక యాప్ ల ద్వారా బెట్టింగ్ కు పాల్పడుతున్నట్లు చెబుతున్నారు. సూపర్-12 రౌండ్ లో భారత్, పాకిస్థాన్ జట్లు నేడు తలపడేందుకు ముహుర్తం ఫిక్స్ అవడంతో ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రియులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

దేశాన్ని ఊపేస్తున్న క్రికెట్ మేనియా

దేశాన్ని ఊపేస్తున్న క్రికెట్ మేనియా

ఇదే సమయంలో ఈ మ్యాచ్ పై వెయ్యి కోట్ల పైగానే బెట్టింగులు జరుతున్నాయని టాక్ విన్పిస్తోంది. హోటళ్లు..రెస్టారెంట్స్ ప్రత్యేకంగా బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేసి మ్యాచ్ ను తిలకించే ఏర్పాటు చేస్తున్నారు, కొన్ని సినిమా హాళ్లలోనూ మ్యాచ్ ను ప్రదర్శించే విధంగా సిద్దం అవుతున్నారు. దీంతో..సండే క్రికెట్ మేనియా దేశ వ్యాప్తంగా మ్యాజిక్ చేస్తోంది. ఇక, అపార్ట్ మెంట్స్ ల్లోనూ అందరూ కలిసి మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూస్తూ ఆస్వాదించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పూజలు సైతం నిర్వహించారు.

English summary
Bettings are nowhere being controlled. This has reached its peak ahead of India vs Pakistan match.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X