వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీర్‌ లేని భారత్, చైనాలో అరుణాచల్ ప్రదేశ్! మోడీకి ఫిర్యాదు చేసిన ఎన్నారై..

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ లేకుండా భారతదేశాన్ని ఊహిచుకోగలమా? కానీ ఈ రెండు ప్రాంతాలు లేకుండానే ఇండియా మ్యాపులు, గ్లోబులు విపరీతంగా తయారు కావడమేకాదు, వాటి అమ్మకాలూ యథేచ్ఛగా సాగుతున్నాయి.

అమెరికాకు చెందిన మల్టీనేషనల్ రిటైల్ చెయిన్ సంస్థ కోస్ట్కో.. కెనడా, అమెరికాల్లో ఇలాంటి మ్యాప్‌లను విక్రయిస్తుండడం వివాదాస్పదంగా మారింది. కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్‌లు లేకుండా తయారైన గ్లోబ్‌లు కోస్ట్కో స్టోర్‌లో దర్శనమిస్తున్నాయి.

వాల్‌మార్ట్ తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రిటైల్ సంస్థ అయిన కోస్ట్కో‌కు అమెరికా, కెనడా, బ్రిటన్, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, ఆస్ట్రేలియా, స్పెయిన్, ఐస్‌లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో 700కిపైగా స్టోర్లున్నాయి.

ఆ స్టోర్‌లో అమ్మకానికి ఉంచిన గ్లోబ్‌లలో కశ్మీర్‌ను ప్రత్యేక ప్రాంతంగా, అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా భూభాగంలో చూపించారు. ఇలా తప్పుల తడకగా ఇండియా మ్యాప్‌ను, గ్లోబ్‌లను రూపొందించడంపై పలువురు నెటిజన్లు, ఎన్నారైలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ గ్లోబ్‌ల మీద 'మేడిన్ చైనా' ముద్ర కనిపిస్తోంది. దీంతో ఈ గ్లోబ్‌ల అమ్మకాలు తక్షణమే నిలిపివేయాలంటూ పలువురు ఎన్నారైలు కోస్ట్కో స్టోర్ నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు.

మరోవైపు కొందరు ఎన్నారైలు నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ, విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌లకు ట్విట్టర్ ‌ద్వారా ఫిర్యాదు చేశారు. ఇండియా మ్యాప్ తప్పుగా ఉన్న గ్లోబ్‌ను న్యూజెర్సీలోని కోస్ట్కో స్టోర్‌తోపాటు అమెజాన్‌లో విక్రయిస్తుండటం చూశానని హైదరాబాద్‌కు చెందిన జోయ్ ట్విట్టర్ ద్వారా ప్రధాని మోడీకి ఫిర్యాదు చేశారు.

English summary
A US multinational retail chain has been accused of selling a globe that allegedly carries a distorted map of India. Pictures of the globe being sold at Costco stores in Canada and elsewhere have gone viral on social media that show India's map without Kashmir and Arunachal Pradesh. While the globe shows Kashmir as a separate territory, Arunachal Pradesh is shown as part of China. Several Twitter users tweeted images of the globe in question and expressed shock and outrage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X