ప్రాణాలను అరచేతిలో పట్టుకుని పరుగులు తీసిన ఇంగ్లాండ్ క్రికెటర్లు..?

భారత్ , పాక్ మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. పహల్గామ్‌‌లో ఉగ్రవాదుల దాడి తర్వాత ఇండియా , పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ ఉగ్ర దాడికి ప్రతీకారం తీర్చుకుంది భారత్.ఆపరేషన్ సింధూర్‌ పేరిట పాకిస్థాన్‌‌లో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసింది భారత్ ఆర్మీ. ఈ దాడిలో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇండియా దాడి చేయడంతో పాక్ పగతో రగిలిపోతుంది. సరిహద్దు ప్రాంతాల్లో పాక్ సామాన్య ప్రజలపై కాల్పులకు తెగపడుతుంది.

ఈ దాడి 15 మంది భారత పౌరులు మరణించారు. 150 మందికి పైగా గాయాలయ్యాయి. భారత్ సైతం పాక్‌కు గట్టిగానే బుద్ధి చెబుతోంది. దీనిలో భాగంగానే పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్ ఉండే రావల్పిండిపై భారత్ ఆర్మీ డ్రోన్ దాడులు జరిగాయి. రావల్పిండి క్రికెట్ స్టేడియం వద్ద ఓ డ్రోన్ కూలిపోయినట్టు తెలుస్తోంది.ఈ దాడిలో స్టేడియం కొంత మేర దెబ్బతిన్నట్టు సమాచారం. ఈ దాడిలో ఇద్దరు గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించారు.

Indian Army attack on Rawalpindi stadium

రావల్పిండిలో ఈ రాత్రి పీఎస్ఎల్ క్రికెట్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ నిర్వహణపై అనుమాన మేఘాలు అలముకున్నాయి. భారత్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో పీఎస్ఎల్ లోని మిగతా మ్యాచ్‌లను పాక్ క్రికెట్ బోర్డు దుబాయ్‌కి మార్చాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. దాడి సమయంలో ఇంగ్లాండ్‌కు చెందిన ఆటగాళ్లు అక్కడే ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. అయితే ఈ దాడిలో వారికి ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది.

క్షుణ్ణంగా ప్రణాళిక వేసిన భారత ఆర్మీ కమాండోలు, అత్యంత వేగంగా రంగంలోకి దిగారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా, కేవలం ఉగ్రవాదులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్‌ను నిర్వహించారు. హెలికాప్టర్ల నుండి దిగిన సైనికులు, క్షణాల్లో స్టేడియం చుట్టూ మోహరించారు. లోపలికి చొచ్చుకెళ్లి, ఉగ్రవాదులను చుట్టుముట్టారు. ఈ దాడి ఎంత వేగంగా జరిగిందో, అంతకు మించి రహస్యంగా ఉంచారు.

అంతర్జాతీయ మీడియా సైతం ఈ ఘటన గురించి ఆలస్యంగా తెలుసుకుంది. భారత ప్రభుత్వం మాత్రం ఇది ఉగ్రవాదంపై పోరాటంలో ఒక ముఖ్యమైన ముందడుగు అని స్పష్టం చేసింది.రావల్పిండి స్టేడియంపై జరిగిన ఈ దాడి పాకిస్థాన్‌లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఇది అంతర్జాతీయ సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. అయితే, భారత ఆర్మీ మాత్రం తమ చర్యను సమర్థించుకుంటోంది. దేశ భద్రత ,అమాయక ప్రజల ప్రాణాలను కాపాడటానికి ఇలాంటి కఠిన చర్యలు తప్పవని వాదిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+