పాకిస్థాన్ పైలట్ ను సజీవంగా పట్టుకున్న ఇండియన్ ఆర్మీ
భారత్- పాకిస్థాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్ కు చెందిన ఎఫ్- 16 ఫైటర్ జెట్ పైలట్ ను ఇండియన్ ఆర్మీ సజీవంగా పట్టుకున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ జైసల్మేర్ లో అతడిని కస్టడీలోకి తీసుకున్నట్లు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. దీనిపై మరికొద్ది సేపట్లో అధికారిక ప్రకటన రానుంది.
మరోవైపు ఆపరేషన్ సింధూర్ రెండో రోజు కొనసాగుతోంది. భారత్.. పాకిస్థాన్ లోని లాహోర్, సియోల్ కోట్, పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ నగరాలపై అటాక్ ప్రారంభించింది. అక్కడి పాకిస్థాన్ క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేస్తోంది. మరోవైపు పాకిస్థాన్ జమ్మూపై హమాస్ తరహా డ్రోన్ దాడులకు పాల్పడుతోంది. అయితే భారత వాయు సేన పాక్ ప్రయోగించిన దాదాపు 8 క్షిపణులు, డ్రోన్లను కూల్చేసింది.

మరోవైపు భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న వేళ అనేక రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. సరిహద్దు జిల్లాల్లో ఇప్పటికే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. పాఠశాలలు మూసివేశారు. పోలీసు సిబ్బంది, ఇతర అధికారుల సెలవులను రద్దు చేశారు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ తో సహా పంజాబ్, హరియాణా, రాజస్థాన్, దిల్లీ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్రాలు చర్యలు చేపడుతున్నాయి.












Click it and Unblock the Notifications