పాకిస్తాన్ ఉగ్రవాదుల చొరబాట్లను వీడీయోలతో సహా బయటపెట్టిన భారత ఆర్మీ...!
కశ్మీర్‌లో ఆర్టికల్ 370 తొలగింపు తర్వాత పాకిస్థాన్ అనేక కుయుక్తులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే..ఈ నేపథ్యంలోనే భారత్‌లోకి పాకిస్థాన్ ఉగ్రవాదులను చొప్పించి భారత్‌లో శాంతిబద్రతలతో పాటు ఆర్ధిక గందరగోళాన్ని సృష్టించేందుకు ఆదేశం ప్రయత్నాలు చేస్తోంది. అయితే పాకిస్థాన్ చేస్తున్న కుయుక్తులను తిప్పికొట్టిన భారత్ అందుకు సంబంధించిన సాక్ష్యాలను సైతం బయటపెట్టింది. పాకిస్థాన్ నుండి ఇండియాలోకి చొరబడుతున్న ఉగ్రవాదులను హతం చేసిన సైన్యం, ఉగ్రవాదుల చొరబాటును వీడీయోలతో సహా బయటపెట్టింది.
భారత్‌లో అల్లర్లు సృష్టించేందుకు పాక్ యత్నం
పాకిస్థాన్ చేస్తున్న కుట్రలను భారత ఆర్మి ఆధారాలతో సహా బయటపెట్టింది. ఆగస్టు ఆయిదున కశ్మీర్‌కు ప్ర్యత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ తోపాటు రాష్ట్రాన్ని విభజించడంతో పాకిస్థాన్ రెచ్చిపోయిన విషయం తెలిసిందే.. కశ్మీర్‌లో ఉగ్రమూకలను చొరబాటు చేయించి అల్లర్లు సృష్టించాలనే కుట్రకు తెరలేపింది. దీంతో సైన్యం సహాకారం పలువురు ఉగ్రావాదులను ఆగస్టు మొదటి వారంలో భారత్‌లోకి పంపించేందుకు ప్రయత్నాలు చేసింది. దీంతో అప్రమత్తమైన భారత భద్రతా దళాలు చొరబాటు దారులను అక్కడికక్కడే మట్టుబెట్టాయి. దీంతో పలువురు ఉగ్రవాదులతో పాటు పాకిస్థాన్ సైన్యం సైతం హతమయ్యారు.

కెరాన్ సెక్టార్‌లో చొరబాటుదారులను హతం చేసిన భారత బలగాలు
అయితే పాకిస్థాన్ ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబాటుకు యత్నిస్తున్న నేపథ్యంలోనే వారిని మట్టుబెట్టిన వీడీయోను విడుదల చేసింది. గత ఆగస్టులో మొదటి వారంలోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద కెరాన్ సరిహద్దు వద్ద 5గురు ఉగ్రవాదులు చోరబాటుకు యత్నిస్తుంగా భారత దళాలు మట్టుబెట్టాయి. దీంతో వారి శవాలతో సహ భారత భద్రతా దళాలు వీడీయోలో బయటపెట్టాయి. ఇక ఈ సంఘటన తర్వాత ఎల్ఓసిలో మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసిన భారత సైన్యం పలువురు ఉగ్రవాదులను కూడ గుర్తించింది. దీంతో పలువురు పాకిస్థాన్ సైన్యంతోపాటు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది.

నెల రోజుల్లోనే 10 మంది పాక్ సైన్యం హతం
ఇప్పటికే పలువురు చొరబాటు దారులను భారత సైన్యం మట్టుపెట్టింది. ఉగ్రవాదులతోపాటు ఆగస్టు 5 నుండి ఉగ్రవాదుల చొరబాటుకు సహకరిస్తున్న పాకిస్థాన్ ఆర్మీ జవానులను కూడ 10 మందిని భారత దళాలు మట్టుపెట్టాయి. అయినా పాకిస్థాన్ మాత్రం భారత్‌ను అంతర్జాతీయ సమాజంలో దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలోనే ఎలాంటీ సాక్ష్యాలు లేక అంతర్జాతీయ న్యాయస్థానంలో కూడ కేసును వేసేందుకు పాకిస్థాన్ వెనకడుగు వేసింది. ప్రస్థుతం భారత్ వద్ద ఆధారాలు ఉన్న నేపథ్యంలో పాకిస్థాన్ చొరబాట్లకు తెగబడుతుందనే వాదనతో భారత్ అంతర్జాతీయ సమాజానికి వివరించేందుకు సన్నహాలు చేస్తోంది.
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..!












Click it and Unblock the Notifications