కాళ రాత్రి.. యుద్ధం మొదలు.. లాహోర్, ఇస్లామాబాద్ నగరాలు ధ్వంసం
ఆపరేషన్ సింధూర్ రెండో రోజు కొనసాగుతోంది. భారత్.. పాకిస్థాన్ లోని లాహోర్,సియోల్ కోట్, పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ నగరాలపై అటాక్ ప్రారంభించింది. అక్కడి పాకిస్థాన్ క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేస్తోంది. మరోవైపు పాకిస్థాన్ జమ్మూపై హమాస్ తరహా డ్రోన్ దాడులకు పాల్పడుతోంది. అయితే భారత వాయు సేన పాక్ ప్రయోగించిన దాదాపు 8 క్షిపణులు, డ్రోన్లను కూల్చేసింది.

కాశ్మీర్ లో పాకిస్థాన్ 8 మిసైల్స్,10 డ్రోన్లతో దాడులకు పాల్పడింది. ఒక F16, రెండు F17 ఫైటర్ జెట్లను కూడా ప్రయోగించింది. వెంటనే అప్రమత్తమైన ఇండియన్ ఆర్మీ మిసైల్స్, డ్రోన్ల ను కూల్చివేసింది. అలాగే F16, రెండు F17 యుద్ధ విమానాలకు కూడా నేలమట్టం చేసింది.
#WATCH | A complete blackout has been enforced in Srinagar in Jammu and Kashmir
— ANI (@ANI) May 8, 2025
(Visuals deferred by an unspecified time) pic.twitter.com/7PM4sfaL7i
మరోవైపు జమ్ము సివిల్ ఎయిర్‌పోర్ట్, సాంబా, ఆర్ఎస్‌పుర, అర్నియా, ప్రాంతాల్లో 8 మిసైల్స్, డ్రోన్లతో దాడులకు పాకిస్థాన్ యత్నించింది. వెంటనే స్పందించిన భారత ఆర్మీ S-400, ఆకాష్ ఎయిర్ సిస్టమ్‌తో ఈ మిసైల్స్, డ్రోన్ల ను సమర్థవంతంగా కూల్చివేసింది.
#WATCH | A complete blackout has been enforced in Jodhpur in Rajasthan
— ANI (@ANI) May 8, 2025
(Visuals deferred by an unspecified time) pic.twitter.com/8eavwk0eV5
యుద్ధం కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ అర్ధాంతరంగా రద్దయింది. దిల్లీ కేపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రేక్షకులు స్టేడియంను ఖాళీ చేయాలని చెప్పారు.












Click it and Unblock the Notifications