"ఆపరేషన్‌ సిందూర్‌"పై మరో వీడియో రిలీజ్ చేసిన ఇండియన్ ఆర్మీ..

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల చోటు చేసుకున్న ఘోర ఉగ్రదాడిలో 26 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేశానికి దారి తీసింది. ఈ దాడికి తగిన ప్రతిస్పందనగా, మే 7న భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్' పేరిట పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడులు కేవలం ప్రతీకార చర్యగా కాకుండా.. బాధిత కుటుంబాలకు ఇండియన్ ఆర్మీ చేసిన న్యాయం అని స్పష్టం చేసింది.

Planned, Trained, Executed...

భారత సైన్యం పశ్చిమ కమాండ్ తాజాగా విడుదల చేసిన వీడియోలో.. "Planned, Trained, Executed" అనే నినాదంతో సైనికుల ప్రణాళికాను ప్రజలకు వివరించారు. వీడియోలో కనిపించిన సైనికులు - ''ఇది కేవలం ప్రతీకారం కాదు, బాధితుల కోసం న్యాయం. పాకిస్థాన్ తరతరాలకు గుర్తుండేలా గుణపాఠం నేర్పాం'' అని తెలిపారు.

indian-army-releases-another-video-on-operation-sindoor

పాకిస్థాన్‌లోని బహావల్‌పూర్, మురిద్కే వంటి ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద శిక్షణ శిబిరాలను ధ్వంసం చేసింది భారత సైన్యం. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. జైష్-ఎ-మహమ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల ప్రధాన కార్యాలయాలు ధ్వంసమయ్యాయి. ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్థాన్, భారత్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అయితే, అమెరికా మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు భారత్ వైపు నిలబడితే టర్కీ మాత్రం పాకిస్థాన్‌కు బహిరంగంగా మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ సైనిక స్థావరాల జోలికి పోకుండా, కేవలం ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా మారిన చోట్లనే మన బలగాలు ప్రహరించాయి. అత్యంత పక్కా ప్రణాళికతో, ప్రెసిషన్ స్ట్రైక్స్‌తో ఈ ఆపరేషన్ విజయవంతమైంది. పహల్గాం దాడిలో ఉగ్రవాదులు పురుషులను మాత్రమే టార్గెట్ గా చేసుకొని కాల్చి చంపారు. దీంతో మృతుల భార్యాలకు నుదుట సిందూరాన్ని దూరం చేసిన కారణంగానే ఈ ఆపరేషన్‌కు 'సిందూర్‌' అని నామకరణం చేసినట్టు స్పష్టం చేశారు.

ఇండియన్ ఆర్మీ దాడులు జరిపిన 9 ప్రధాన ఉగ్ర స్థావరాల్లో 4 పాకిస్తాన్‌లో, 5 పీఓకేలో ఉన్నాయి. ఇందులో ముంబై దాడుల సూత్రదారి లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కంచుకోట మురీడ్కే కూడా ఉంది. ముజఫరాబాద్‌లో 2 శిబిరాలు, కోట్‌లి, గుల్పూర్, భీమ్బర్, సియాల్‌కోట్, చకంబ్రూ, మురీడ్కే, బహావల్పూర్ వంటి ప్రదేశాలు ఇందులో ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+