మరోసారి మానవత్వాన్ని చాటుకున్న ఇండియన్ ఆర్మీ: ముగ్గురు చైనీయులకు సాయం..
భారత సైన్యం మానవత్వాన్ని చాటుకుంది. నార్త్ సిక్కిం పర్వత ప్రాంతంలో 17,500 అడుగుల ఎత్తున దారి తప్పిన ముగ్గురు చైనీయులను ఆర్మీ కాపాడింది. వైద్యసాయం కూడా అందించింది. ఈ నెల 3వ తేదీన ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దారి తప్పిపోయిన చైనా జాతీయులను భారత ఆర్మీ కాపాడింది. ఆక్సిజన్ అందజేసి., ఆహారం, వెచ్చటి దుస్తులు ఇచ్చామని ఆర్మీ తెలిపింది. వారు గమ్యస్థానం చేరుకునేందుకు అవసరమైన గైడెన్స్ కూడా ఇచ్చినట్టు ట్వీట్ చేసింది. భారత ఆర్మీకి అన్నింటికంటే మానవత్వమే ప్రధానమని పేర్కొంది.

తూర్పు లడాఖ్‌లో చైనా బలగాలు దూసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు చర్చలు జరపుతూ.. మరోవైపు తన కపటనీతిని ప్రదర్శిస్తోంది. అయితే దీనిని అంతర్జాతీయ సమాజం ముందు భారత్ ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంది. అదేవిధంగా డ్రాగన్ కు ధీటుగా సమాధానం చెబుతామని రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications