పాక్ కాల్పులకు భారత ఆర్మీ జవాన్ వీరమరణం- తీవ్ర ఉద్రిక్తత
India Pakistan War: పాకిస్తాన్‌పై భారత్ యుద్ధానికి దిగిన నేపథ్యంలో నియంత్రణ రేఖ పొడవునా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దు మొత్తం కూడా భీకరంగా తయారయ్యాయి. పూర్తిస్థాయి యుద్ధానికి సన్నద్ధం అన్నట్లు తయారయ్యాయి.
ఇప్పటికే భారత్- పాకిస్తాన్ సైన్యాన్ని సరిహద్దులకు తరలించాయి. యుద్ధ సామాగ్రిని చేరవేశాయి. సరిహద్దు గ్రామాల ప్రజలను కూడా కేంద్ర ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించింది. బంకర్లల్లో తలదాచుకోవాలనీ సూచించింది. ప్రత్యేకించి- జమ్మూ కాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులు ప్రత్యేకం.

పూర్తిస్థాయిలో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌తో సరిహద్దులను పంచుకుంటోన్న కేంద్ర పాలిత ప్రాంతం ఇది. ఈ రెండు చోట్లే భారత ఆర్మీ బుధవారం తెల్లవారు జామున దాడులు సాగించింది. పాకిస్తాన్ భారీగా నష్టపోయింది కూడా ఇక్కడే. దీన్ని దృష్టిలో పెట్టుకుని పాకిస్తాన్ దురాగతాలకు తెర తీసింది.
సరిహద్దు గ్రామాలపై పదే పదే మోర్టార్ షెల్స్‌తో దాడులకు దిగుతోంది. జమ్మూ కాశ్మీర్‌లో నియంత్రణ రేఖ వెంబడి ఈ దాడులు చోటు చేసుకున్నాయి. భారత వైమానిక దాడులు ముగిసిన కొద్దిసేపటికే సాధారణ పౌరులపై ఇలా మోర్టార్ షెల్స్‌తో ప్రతీకారానికి పాల్పడింది పాకిస్తాన్.
పూంచ్‌లోని కృష్ణ ఘాటి, షాపూర్, మన్‌కోఠ్, జమ్మూ సెక్టార్ రాజౌరి జిల్లాలోని లామ్, మన్జా కోఠ్, కాశ్మీర్ సెక్టార్ కుప్వారా జిల్లాలోని కర్నా, యూరి, తంగ్ధర్, బారాముల్లా వంటి జిల్లాల సరిహద్దు గ్రామాల నివాసితులపై భారీ షెల్లింగ్ దాడులు సాగించింది పాకిస్తాన్ ఆర్మీ. ఫిరంగులతో సైతం కాల్పులు జరిపారు ఆ దేశ సైనికులు. ఆ ఘటనలో పలు నివాసాలు దెబ్బతిన్నాయి.
దీని తరువాత ఆయా గ్రామాలన్నీ కూడా ఖాళీ అయ్యాయి. స్థానికులు బంకర్లకు తరలివెళ్లారు. మరికొందరు సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోయారు. తంగ్ధర్‌లో భారీ నష్టం సంభవించింది. పలు నివాసాలు ధ్వంసం అయ్యాయి. కొన్ని మంటల్లో చిక్కుకున్నాయి. ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో చోటు చేసుకున్న అతి భారీ షెల్లింగ్ ఇదే.
ఈ దాడిలో భారత ఆర్మీ జవాన్, 5 ఫీల్డ్ రెజిమెంట్‌కు చెందిన లాన్స్ నాయక్ దినేష్ కుమార్ శర్మ వీరమరణం పొందారు. ఈ విషయాన్ని ఆర్మీ ధృవీకరించింది. ఈ మేరకు వైట్ నైట్ కార్ప్స్ తన అదికారిక ఎక్స్ అకౌంట్‌లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేసింది. ఆయనతో పాటు 12 మంది పౌరులు మృతిచెందారు. 43 మందికి పైగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తోన్నారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications