వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాకు మరో షాక్.. భారత నగరాల దూకుడు, ఢిల్లీ శరవేగంగా..

చైనాకు భారత్ మరో షాకిచ్చింది. ఇప్పటికే జీడీపీ వృద్ధిలో చైనాను దాటేసిన భారత్.. నగరాల అభివృద్ధి విషయంలోనూ డ్రాగన్‌ను దాటేసింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: చైనాకు భారత్ మరో షాకిచ్చింది. ఇప్పటికే జీడీపీ వృద్ధిలో చైనాను దాటేసిన భారత్.. నగరాల అభివృద్ధి విషయంలోనూ డ్రాగన్‌ను దాటేసింది. ఆసియాలో మరే దేశంలోని నగరాలు విస్తరించనంత వేగంగా భారత నగరాలు విస్తరిస్తున్నాయి.
ఆర్థికాభివృద్ధి పుంజుకోవడం, వాణిజ్యం పెరగడంతో గత ఐదేళ్లుగా వేగంగా విస్తరిస్తున్న మన నగరాలు.. మరింత వేగంతో తమ పరిధిని పెంచుకోనున్నాయి. ఆసియాలోని మిగతా నగరాలతో పోలిస్తే దేశ రాజధాని నగరం ఢిల్లీ అత్యంత వేగంగా విస్తరిస్తోంది.

గత ఏడాది చివర్లో ఉన్న ఢిల్లీతో పోలిస్తే.. 2021 నాటికి ఆ నగరం ఏకంగా 50 శాతం మేర విస్తరించనుందని ఆక్స్‌ఫర్డ్ ఎకనమిక్స్ అధ్యయనం వెల్లడించింది. ఈ అభివృద్ధి రేసులో చైనా వెనుకబడనుందని ఆక్స్‌ఫర్డ్ భావిస్తోంది.

 Indian cities to grow the fastest in Asia as Chinese rivals slow

2012-16 మధ్య కాలంలో ఆసియా నగరాలు 4.5 శాతం చొప్పున వృద్ధి చెందగా.. రానున్న ఐదేళ్లలో అది 4.2 శాతానికి తగ్గనుంది. కానీ టాప్ 5 నగరాలు ఏటా ఆరు శాతం చొప్పున వృద్ధి రేటు కనబర్చనున్నాయి.

అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే.. వ్యాపార విస్తరణకు ఆసియా నగరాల్లో ఎక్కువ అవకాశాలు లభిస్తాయని ఆక్స్‌ఫర్డ్ స్పష్టం చేసింది. టాప్-5లో భారత్‌కు చెందిన 4 నగరాలు నిలవగా.. చైనా నుంచి హో చి మిన్హ్ మాత్రమే చోటు దక్కించుకుంది.

గతంలో జేఎల్ఎల్ వెలువరించిన ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో బెంగళూరు తొలిస్థానంలో నిలవగా.. హైదరాబాద్ ఐదో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.

English summary
Delhi will have the fastest growth of any city in Asia, with the economy to be almost 50% larger in 2021 than it was at the end of last year. Indian cities are set to expand the most across the region, with growth speeding up from the past 5 years, according to a new study from Oxford Economics, which ranked Asia’s 30 largest cities. With financial and business services projected to be the fastest growing sector in India, Delhi’s dominance in this industry will lead to higher growth and higher incomes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X