వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తల్లి మృతితో కుప్పకూలిన జాన్వీ!: శ్రీదేవి డెడ్‌బాడీ అప్పగించలేదు, ఫ్లైట్ పంపిన అంబానీ

|
Google Oneindia TeluguNews

Recommended Video

Sridevi Passes Away : Janhvi Kapoor In Critical Situation

దుబాయ్/ముంబై: దుబాయ్‌లో మృతి చెందిన శ్రీదేవి మృతదేహాన్ని తీసుకు వచ్చేందుకు అనిల్ అంబాని ప్రత్యేక జెట్ విమానాన్ని ఏర్పాటు చేశారు. సమాచారం మేరకు ఆయన ఓ జెట్ విమానాన్ని పంపించారు.

చదవండి: నమ్మలేకపోతున్నాం: శ్రీదేవి మృతిపై జగన్-పవన్ కళ్యాణ్, ఎప్పుడు అదే మాట: జయసుధ

రిలయెన్స్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ ట్రావెల్ లిమిటెడ్‌కు చెందిన 13 సీట్లు కలిగిన ప్రయివేటు (Embraer-135BJ) జెట్‌ను పంపించారు. ఈ విమానం ముంబై నుంచి ఆదివారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో దుబాయ్‌కి బయలుదేరింది.

చదవండి: 2013లో శ్రీదేవికి పద్మశ్రీ, ఎన్నో అవార్డులు: సినిమాల్లో స్టార్, వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు!

 రాత్రి వరకు అప్పగించని వైద్యులు

రాత్రి వరకు అప్పగించని వైద్యులు

శ్రీదేవి భౌతిక కాయాన్ని దుబాయిలోని డాక్టర్లు ఇంకా కుటుంబ సభ్యులకు అప్పగించలేదు. దాదాపు ఇరవై గంటలు గడిచినా ఆమె పార్థివ దేహం ఆసుపత్రిలోనే ఉంది. పోస్టుమార్టం పేరుతో డాక్టర్లు కాలయాపన చేస్తున్నారని తెలుస్తోంది. ఇంకా పోస్టుమార్టం చేయలేదు. శ్రీదేవి మృతదేహం సోమవారం వచ్చే అవకాశముంది.

షేమ్.. షేమ్: నటి శ్రీదేవి మృతిపై కాంగ్రెస్, అవమానం... నెటిజన్ల ఆగ్రహంషేమ్.. షేమ్: నటి శ్రీదేవి మృతిపై కాంగ్రెస్, అవమానం... నెటిజన్ల ఆగ్రహం

అక్కడి నుంచి ప్రయివేటు జెట్‌లో

అక్కడి నుంచి ప్రయివేటు జెట్‌లో

మరికొన్ని పరీక్షలు అవసరమంటూ డాక్టర్లు చెబుతున్నారని తెలుస్తోంది. శవపరీక్ష అనంతరం ఆమె భౌతిక కాయాన్ని ముహైస్నా ఎంబాల్మింగ్‌ సెంటర్‌కు తరలిస్తారు. అక్కడి నుంచి ప్రయివేటు జెట్‌లో ముంబై తరలించనున్నారు.

ఇంట్లో జాన్వీ ఒక్కరే

ఇంట్లో జాన్వీ ఒక్కరే

తల్లి మృతితో శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్‌‌ తల్లడిల్లుతున్నారు. పెళ్లి కోసం శ్రీదేవి, బోనీకపూర్, చిన్న కూతురు ఖుషీ దుబాయ్ వెళ్లారు. అక్కడ శ్రీదేవి మృతి చెందారు. జాన్వి దఢక్ సినిమా షూటింగ్‌ కోసం ముంబైలోనే ఉన్నారు. దాదాపు అందరు బంధువులు పెళ్లి వేడుకల కోసం దుబాయ్‌కు వెళ్లారు. దీంతో జాన్వి ఇంట్లో ఒక్కరే ఉన్నారని తెలుస్తోంది.

బోనీకపూర్‌ను ఎందుకు పెళ్లి చేసుకుందంటే: పెళ్లిలో.. శ్రీదేవి చివరి క్షణాలు (ఫోటోలు)బోనీకపూర్‌ను ఎందుకు పెళ్లి చేసుకుందంటే: పెళ్లిలో.. శ్రీదేవి చివరి క్షణాలు (ఫోటోలు)

కుప్పకూలిన జాన్వీ

కుప్పకూలిన జాన్వీ

తల్లి మరణవార్త విన్న జాన్వీ కుప్పకూలిపోయారు. ఇలాంటి సమయంలో ఆమెకు ధైర్యం చెప్పడానికి దర్శక, నిర్మాత కరణ్‌జోహార్‌ లోఖండ్‌వాలాలోని శ్రీదేవి ఇంటికి వెళ్లారు. ఆమెను జూహూలోని అనిల్‌ కపూర్‌ ఇంటికి తీసుకెళ్లారు.

శ్రీదేవి ఇంటికి బంధువులు

శ్రీదేవి ఇంటికి బంధువులు

భారత్‌లో ఉన్న కపూర్‌‌ కుటుంబ సభ్యులంతా శ్రీదేవి మృతితో జుహూలోని ఆమె ఇంటికి చేరుకుంటున్నారు. మరోవైపు, దుబాయ్‌లో శ్రీదేవి మృతదేహానికి శవపరీక్ష నిర్వహిస్తున్నారు. బోనీకపూర్, ఆయన సోదరుడు సంజయ్‌ కపూర్‌ ఆమె పార్ధివదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం అంత్యక్రియలను నిర్వహించనున్నారు.

బాత్రూంలోనే శ్రీదేవి.. విషాదం ఇలా!: అతిలోక సుందరి గురించి కొన్ని విషయాలు...బాత్రూంలోనే శ్రీదేవి.. విషాదం ఇలా!: అతిలోక సుందరి గురించి కొన్ని విషయాలు...

English summary
In a moving gesture, Indian industrial magnate Anil Ambani has sent an aircraft to Dubai to bring back Bollywood actress Sridevi Kapoor's body to India later on Sunday, sources said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X