• search

నమ్మలేకపోతున్నాం: శ్రీదేవి మృతిపై జగన్-పవన్ కళ్యాణ్, ఎప్పుడు అదే మాట: జయసుధ

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  అమరావతి/హైదరాబాద్: సినీ నటి శ్రీదేవి మృతిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు ఆదివారం స్పందించారు. అతిలోక సుందరి మృతిపై వారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

  చదవండి: బోనీకపూర్‌ను ఎందుకు పెళ్లి చేసుకుందంటే: పెళ్లిలో.. మరణానికి కొద్ది గంటలముందు శ్రీదేవి (ఫోటోలు)

   హార్ట్ ఎటాక్‌‌తో దుబాయ్‌లో 'అతిలోక సుందరి' శ్రీదేవి కన్నుమూత!!

   తన నటన, చరిష్మాతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి శ్రీదేవి అని జగన్ అన్నారు. మరిచిపోలేని పాత్రలను పోషించి, అందరినీ మెప్పించారని చెప్పారు. ఆమె మృతి భారతీయ చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు అన్నారు.

   చదవండి: శ్రీదేవి కన్నుమూత: అతిలోకసుందరికి ఎన్నో అవార్డులు, షూటింగ్‌లో కూతురు!

   ఇంగ్లీష్ వింగ్లీష్‌లో అసమాన ప్రతిభ

   ఇంగ్లీష్ వింగ్లీష్‌లో అసమాన ప్రతిభ

   శ్రీదేవి మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు అని జగన్ అన్నారు. దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్‌లోను ఆమె నటించి అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారన్నారు. ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాలో గృహిణి పాత్ర శ్రీదేవి ఎంతటి అసమాన నటి అన్న విషయం తెలియజేసిందన్నారు.

   తీరని లోటు

   తీరని లోటు

   శ్రీదేవి లెజెండరీ నటి అని, ఆమె మృతి భారతీయ చలన చిత్ర పరిశ్రమకు ముఖ్యంగా ఆమెను అభిమానించే వారికి తీరని లోటు అని జగన్ అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.

   శ్రీదేవి లేరంటే నమ్మలేకపోతున్నాం

   శ్రీదేవి లేరంటే నమ్మలేకపోతున్నాం

   శ్రీదేవి లేరంటే నమ్మలేకపోతున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆమె నటన చిరస్మరణీయమన్నారు. శ్రీదేవి భౌతికంగా లేనప్పటికీ, ఈ లోకాన్ని వీడినా నటిగా చిత్రసీమలో చెరగని సుస్థిర స్థానం సంపాదించుకున్నారని చెప్పారు.

   మా మధ్య పోటీ, కలిసి నటిస్తామనుకోలేదు

   మా మధ్య పోటీ, కలిసి నటిస్తామనుకోలేదు

   శ్రీదేవి ఎప్పుడూ తక్కువగా మాట్లాడేవారని సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే, నటి జయసుధ అన్నారు. తామిద్దరం కలిసి నటిస్తామని ఎప్పుడూ అనుకోలేదని ఉద్వేగంగా చెప్పారు. తామిద్దరి మధ్య కెరీర్‌లో స్నేహపూర్వకమైన పోటీ ఉండేదని చెప్పారు.

   శ్రీదేవి ఎప్పుడూ కూతుళ్ల గురించి మాట్లాడేది

   శ్రీదేవి ఎప్పుడూ కూతుళ్ల గురించి మాట్లాడేది

   శ్రీదేవి ఎప్పుడు కలిసినా తన కూతుళ్ల భవిష్యత్తు గురించి మాట్లాడేదని జయసుధ చెప్పారు. ఆమె ఈ లోకంలో లేరంటే నమ్మలేకపోతున్నానని చెప్పారు. సావిత్రి, బానుమతిలను మినహాయిస్తే శ్రీదేవితో పోల్చదగిన నటులు ఎవరూ లేరని కృష్ణంరాజు అన్నారు.

   శ్రీదేవి మృతి అందరినీ షాక్‌కు గురి చేసింది

   శ్రీదేవి మృతి అందరినీ షాక్‌కు గురి చేసింది

   శ్రీదేవి మృతి అందరినీ షాక్‌కు గురి చేసింది. ఆమెకు ఎనిమిదేళ్లుగా హైపర్ థైరాయిడిజమ్ సమస్య ఉంది. 2010-11లో క్యాన్సర్ వచ్చినట్లు వదంతులు వినిపించాయి. శ్రీదేవి తల్లి రాజేశ్వరి తెలుగువారు. శ్రీదేవి - మిథున్ చక్రవర్తి మధ్య గతంలో పెళ్లి జరిగినట్లు కథనాలు వచ్చాయి. కొన్ని పత్రికలు పెళ్లి సర్టిఫికేట్‌ను కూడా ప్రచురించాయి.

   తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

   English summary
   Having a career which expanded for over four decades, Bollywood's Veteran actress Sridevi passed away at the age of 54. The actor, wife of producer Boney Kapoor, died late in the night reportedly due to cardiac arrest in Dubai, where she had gone along with her family to attend her nephew Mohit Marwah's wedding.

   Oneindia బ్రేకింగ్ న్యూస్
   రోజంతా తాజా వార్తలను పొందండి

   X
   We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more