ఇద్దరు మగాళ్ల మధ్య సె*క్స్.. ముగ్గురు దోస్తుల ఘాతుకం!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ జిల్లా సైఫానీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన ఓ యువకుడి హత్య కేసులో పోలీసులు సంచలన నిజాలను బయటపెట్టారు. మే 26న మెడపై పదునైన ఆయుధంతో నరికి హత్యకు గురైన ఓ యువకుడి మృతదేహం లభ్యం కావడంతో ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయడంతో ఈ దారుణ హత్య వెనుక ఉన్న అసలు కారణం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అరెస్ట్ చేసిన నిందితులను మొహ్సిన్, డానిష్, ఖాసిమ్‌లుగా గుర్తించారు. వీరంతా ఒకరికొకరు స్నేహితులు. ముగ్గురు రాజస్థాన్‌లో కలిసి వెల్డింగ్ పనులు చేసేవారు. మృతుడైన యువకుడికి, నిందితుల్లో ఒకరికి మధ్య గతంలో అసహజ లైంగిక సంబంధం ఉండేది. అయితే ఆ సమయంలో మృతుడు వారిద్దరి ప్రైవేట్ వీడియోను మొబైల్‌లో రికార్డ్ చేశాడు. ఆ వీడియోను చూపించి, నిందితుడి కుటుంబ సభ్యులకు లీక్ చేస్తానంటూ గత కొంతకాలంగా సదరు యువకుడు నిరంతరం బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నాడు.

Rampur Murder Case Youth Killed By Friends Over Gay Relationship Video Blackmailing Full Details

ఆ వీడియో బ్లాక్ మెయిలింగ్ వేధింపుల నుంచి ఎలాగైనా విముక్తి పొందాలని భావించిన సదరు నిందితుడు.. తన ఇద్దరు స్నేహితులతో కలిసి ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగానే ముగ్గురూ కలిసి ఆ యువకుడిని దారుణంగా హతమార్చారు. హత్యానంతరం సాక్ష్యాలను దాచడానికి మృతుడి మొబైల్ ఫోన్‌ను పగలగొట్టారు. నిందితుల నుంచి మృతుడికి చెందిన పగిలిపోయిన మొబైల్ ఫోన్, ఒక చైన్, ఉంగరం, కొంత నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసు వివరాలను రాంపూర్ ఏఎస్పీ అనురాగ్ సింగ్ మీడియాకు వెల్లడించారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మూడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి ఈ కేసును చేధించాయని ఆయన వెల్లడించారు. ప్రైవేట్ వీడియోల ద్వారా జరుగుతున్న బ్లాక్‌మెయిలింగే ఈ హత్యకు ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో స్పష్టమైందని, నిందితులపై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని ఏఎస్పీ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+