పాక్ కు సరైన బుద్ది చెప్పాం.. ఆపరేషన్‌ సిందూర్‌ లక్ష్యం అదే..?

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాపిష్టి పాక్ కు భారత సైన్యం సరైన బుద్ధి చెప్పింది. పహల్గాం ఉగ్రదాడిపై ప్రతీకారం కోరుకున్న ప్రతి భారతీయుడికి కొత్త ఊపిరిని ఇచ్చింది. ఉగ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ ని ప్రారంభించింది. పాక్ సైన్యం చేస్తున్న దాడులను తిప్పి కొట్టడమే కాక.. దాయాదిపైనే బాంబుల వర్షం కురిపించింది. పదుల సంఖ్యలో సైన్యంతో పాటు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. తాజాగా ఆ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలను భారత DGMO లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ వెల్లడించారు.

ఉగ్రవాదాన్ని అంతం చేసే లక్ష్యంతోనే ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టామన్నారు రాజీవ్ ఘాయ్. తాము చేపట్టిన ఆపరేషన్‌లో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారని తేల్చి చెప్పారు. భారత సైన్యం ముందు నిలవలేక ఉగ్రశిబిరాలు ఖాళీ అవుతున్నాయన్నారు. పీవోకేలో 5, పాకిస్థాన్ లో 4 ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేసినట్లు వెల్లడించారు.

indian-dgmo-lieutenant-general-rajiv-ghai-comments

పహల్గాం దాడి తర్వాత భారత ప్రభుత్వం తమకి అన్ని అధికారాలు ఇచ్చిందని.. దీంతో ఉగ్రవాదులకు దీటుగా బదులివ్వాలని నిర్ణయించామని తెలిపారు. ఉగ్రవాదులకు సరైన రీతిలో జవాబు చెప్పాలన్నదే ఆపరేషన్‌ సిందూర్‌ లక్ష్యమన్నారు త్రివిధ దళాతిపతులు. సరిహద్దు అవతల ఉన్న ఉగ్ర శిబిరాలను కచ్చితమైన ఆధారాలతో గుర్తించి.. తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు చనిపోయారు. ఈ ఆపరేషన్‌ సిందూర్‌లో 1999 ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ ఫ్లైట్‌ ఐసీ 814 హైజాక్‌ ఘటన, 2019లో పుల్వామా దాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదులు హతమయ్యారన వెల్లడించారు. వీరిలో యూసుఫ్‌ అజహర్‌, అబ్దుల్‌ మాలిక్‌ రౌఫ్‌, ముదాసిర్‌ అహ్మద్‌ లాంటి కరుడుగట్టిన ముష్కరులున్నారని ఆర్మీ డీజీఎంవో రాజీవ్‌ ఘాయ్‌ వెల్లడించారు.

అలాగే ఈ నెల 8, 9వ తేదీ రాత్రి భారత్‌పై ఎయిర్ స్ట్రైక్ కి పాకిస్థాన్‌ యత్నించింది. డ్రోన్లు, మానవరహిత విమానాలు మనవైపు దూసుకొచ్చాయి. వాటన్నింటినీ భారత గగనతల రక్షణ వ్యవస్థ సమర్థంగా తిప్పికొట్టింది. పౌరులపై దాడులను అడ్డుకున్నాం. డ్రోన్‌ దాడులకు ప్రతిగా పాక్‌ రాడార్‌ స్టేషన్లు, సైనిక స్థావరాలపై బలమైన దాడులు నిర్వహించాం. తమ ఫైటర్ జెట్ లతో పాకిస్థాన్ లో ఉన్న లక్ష్యాలను ఛేదించాం. లక్ష్యాల సాధనలో భారత్‌వైపు ఎలాంటి నష్టం లేకుండా దాడులు చేశాం. భారత్‌వైపు వచ్చిన ప్రతి డ్రోన్‌ను నిర్వీర్యం చేశామన్నారు భారత సైన్యాధికారులు.

లాహోర్‌, గుజ్రన్‌వాలా రాడార్‌ కేంద్రాలను ధ్వంసం చేశాం. డ్రోన్ల దాడుల సమయంలో పాకిస్థాన్‌ పౌరవిమానాలనూ ఆకాశంలోకి అనుమతించింది. పరిస్థితి గమనిస్తూ.. కచ్చితమైన లక్ష్యాలతో పాక్‌ సైనిక స్థావరాలపై దాడులు చేశాం. మొత్తంగా మూడు రోజులపాటు కొనసాగిన దాడుల్లో 35 నుంచి 40 మంది పాకిస్థాన్‌ సైనికులు చనిపోయినట్లు అంచనా వేస్తున్నామన్నారు.

పాక్‌ ఎన్ని దుశ్చర్యలకు పాల్పడినా దీటుగా స్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు త్రివిధ దళాధిపతులు. పాక్‌ ప్రతిపాదన మేరకే కాల్పుల విరమణపై అవగాహనకు వచ్చామన్నారు.ృ అయినా కొన్ని గంటల్లోనే పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మళ్లీ డ్రోన్‌ దాడులు చేసిందని పేర్కొన్నారు. ఇదే పరిస్థితి ఇవాళ కూడా కొనసాగితే తీవ్ర ప్రతిచర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+