గత ఐదేళ్లలో పాక్‌పై జరిగింది రెండు కాదు... మూడు దాడులు: రాజ్‌నాథ్ సింగ్
మంగళూరు: కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ 2014లో బాధ్యతలు చేపట్టిన తర్వాత పాకిస్తాన్‌పై భారత్ ఎన్నిసార్లు దాడులు నిర్వహించింది... మనకు తెలిసినంతవరకు ఒకటి ఊడి సర్జికల్ స్ట్రైక్స్ రెండోది పుల్వామా ఉగ్రదాడులకు ప్రతీకారచర్యల్లో భాగంగా జరిగిన బాలాకోట్ వైమానిక దాడులు మాత్రమే. కానీ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాత్రం బీజేపీ అధికారంలోకి వచ్చాక గత ఐదేళ్లలో మూడుసార్లు పాకిస్తాన్‌పై దాడి చేసినట్లు చెప్పారు. అయితే దీనికి సంబంధించిన ఎలాంటి విషయాలను వెల్లడించలేదు రాజ్‌నాథ్ సింగ్.

కర్నాటకలోని మంగళూరులో ఓ బహిరంగర్యాలీలో ప్రసంగించిన రాజ్‌నాథ్ సింగ్ మూడోసారి కూడా భారత్ పాకిస్తాన్‌పై దాడి చేసిందన్నారు.అయితే ఇది సరిహద్దు రేఖకు సమీపంలో ఉగ్రవాదులు లక్ష్యంగా చేసిన దాడులని వెల్లడించారు. మూడుసార్లు సరిహద్దు రేఖ దాటి పాక్ భూభాగంలోకి భారత బలగాలు వెళ్లాయని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. రెండు దాడులపై సమాచారం అయితే ఇవ్వగలను కానీ మూడోసారి జరిగిన దాడులపై మాత్రం ఎలాంటి సమాచారం బహిర్గతం చేయలేనని వెల్లడించారు.ఒక సారి ఊడి ఘటన, మరోసారి పుల్వామా దాడులకు ప్రతీకారంగా దాడులు చేశామని చెప్పిన రాజ్‌నాథ్ సింగ్ మూడో దాడులు గురించి ఏమి చెప్పలేనని స్పష్టం చేశారు.
#WATCH Union Home Minister Rajnath Singh at a public rally in Mangaluru: Pichle 5 varsho mein, teen baar apni seema ke bahar jaa kar hum logon ne air strike kar kaamyaabi haasil ki hai. Do ki jaankari apko dunga, teesri ki nahi dunga. #Karnataka pic.twitter.com/NZKeJPulrS
— ANI (@ANI) March 9, 2019
"ఊరి ఘటనలో అంతా చూసే ఉంటారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు 17 మంది జవాన్ల ప్రాణాలను పొట్టనబెట్టుకున్నారు.ఆ తర్వాత మన ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. రెండోది పుల్వామా దాడుల తర్వాత జరిగింది. భారత్ అప్పటిలా లేదని... ఏదైనా దాడులు భారత భూభాగంపై వెంటనే ప్రతీకార దాడులు చేస్తుందని రాజ్‌నాథ్ చెప్పారు. గత ప్రభుత్వాల వల్ల భారత్ బలహీనంగా మారిందని తమ ప్రభుత్వంలో దెబ్బకు దెబ్బ అనేలా వ్యవహరిస్తోందని చెప్పారు.
ఎవరిపై అనవసరంగా దాడి చేయమని అదే సమయంలో ఎవరైనా దాడి చేస్తూ చూస్తూ ఊరుకోబోమని అన్నారు రాజ్‌నాథ్ సింగ్. ఆర్మీ త్యాగాలను కొందరు గుర్తించడం లేదని వారికి రుజువులు కావాలంటూ రోడ్లపెకొచ్చి మాట్లాడుతున్నారని కాంగ్రెస్‌పై పరోక్షంగా మండిపడ్డారు రాజ్‌నాథ్ సింగ్.
-
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్‌కు తాకట్టు -
ప్రపంచంలోనే తొలి స్థానంలో పాకిస్థాన్.. ఆ ఒక్క విషయంలో.. -
లష్కరే తోయిబా ఉగ్రవాది హత్య.. చంపేసింది సొంత కుటుంబ సభ్యులే! -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు












Click it and Unblock the Notifications