• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సంచ‌ల‌నం..ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు: ప‌్ర‌త్యేక ప్ర‌తిప‌త్తి కోల్పోయిన జుమ్ము కాశ్మీర్‌

|

భార‌త రాజ‌కీయ చ‌రిత్ర‌లో సంచ‌ల‌న నిర్ణ‌యం. 70 ఏళ్లుగా ఎవ‌రూ చేయ‌ని సాహ‌సం..ఎవ‌రూ ముట్టుకోవ‌టానికి ధైర్యం చేయ‌ని అంశంలో మోదీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. జ‌మ్ము కాశ్మీర్‌కు ప్ర‌త్యేక ప్ర‌తిప‌త్తి ర‌ద్దు చేస్తూ సంచ‌ల న నిర్ణ‌యం తీసుకున్నారు. కేంద్ర కేబినెట్‌లో ఆమోదం పొందిన కొద్ది సేప‌టికే రాష్ట్రప‌తి ఆమోదిస్తూ గ‌జెట్ విడుద‌ల చేసారు. దీంతో జ‌మ్ము కాశ్మీర్ విష‌యంలో ఏడు ద‌శాబ్దాలుగా కొన‌సాగుతూ వ‌స్తున్న ప్ర‌త్యేక ప్ర‌తిప‌త్తి ర‌ద్ద‌యింది. ఇదే స‌మ‌యంలో జ‌మ్ము కాశ్మీర్ ను మూడు ప్రాంతాలు విభ‌జించారు. జ‌మ్ము- కాశ్మీర్‌ను అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేస్తూ...అదే స‌మ‌యంలో ల‌డ‌ఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్ర‌క‌టించారు. అస‌లు..ఈ ఆర్టిక‌ల్ 370 ఏం చెబుతోంది.. ఇప్పుడు ర‌ద్దు ద్వారా ఏం జ‌ర‌గ‌నుంది..

ఆర్డిక‌ల్ 370 ఏం చెబుతోంది...

ఆర్డిక‌ల్ 370 ఏం చెబుతోంది...

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించడం కోసం రాజ్యాంగంలో ఆర్టికల్‌ 370 పేరిట ప్ర‌త్యేకంగా రూపొం దించిన నిబంధ‌న ఇది. 1947 అక్టోబరు 26న కశ్మీర్‌ను భారత యూనియన్‌లో విలీనం చేశారు. రక్షణ, విదేశీ వ్యవహారా లు, కమ్యూనికేషన్లు అనే మూడు అంశాలకే ఈ విలీనం తొలుత పరిమితమైంది. దీంతో..1949 జులైలో నేషనల్‌ కాన్ఫ రెన్స్‌ అగ్రనేత షేక్‌ అబ్దుల్లా భారత ప్రభుత్వంతో చర్చల ఫ‌లితంగా కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని రాజ్యాంగంలో చేర్చారు. దీంతో..రక్షణ, విదేశీ, ఆర్థిక, కమ్యూనికేషన్‌ వ్యవహారాలు తప్ప మిగతా వాటిలో కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఇతర చట్టాల్ని అమలుచేయాలంటే రాష్ట్ర సమ్మతిని పార్లమెంటు తీసుకోవాల్సి ఉంటుంది. పౌరసత్వం, ఆస్తిపై హక్కు, ప్రాథమిక హక్కుల విషయంలో రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక చట్టాలు ఉంటాయి. అందువల్ల ఈ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల వారు భూముల్ని కొనలేరు. ఆర్టికల్‌ 360 కింద ఈ రాష్ట్రంలో కేంద్రం ఆర్థిక ఎమర్జెన్సీని విధించలేరు.

జ‌మ్ము కాశ్మీర్‌కు ప్ర‌త్యేక రాజ్యంగం...

జ‌మ్ము కాశ్మీర్‌కు ప్ర‌త్యేక రాజ్యంగం...

జ‌మ్ము కాశ్మీర్ స‌మ‌స్య ప‌రిష్కారం కోసం..అక్క‌డ ప్ర‌జ‌ల్లో మనోధైర్యం ఇవ్వ‌టం కోసం అప్ప‌ట్లో పెద్ద మ‌నుషుల ఒప్పం దంలో భాగంగా ఆర్టిక‌ల్ 370 రూపుదిద్దుకుంది. దీని ద్వారా జ‌మ్ము కాశ్మీర్ ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్యేకంగా చ‌ట్టం అమ‌ల్లో ఉంది. ఏడు ద‌శాబ్దాలుగా ఇది అమ‌ల‌వుతూ వ‌స్తోంది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక పీనల్ కోడ్ ఉన్నాయి. ఆ

రాష్ట ప్రజలకు ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ కాలపరిమితి ఆరేళ్లు. ఆర్టికల్ 370 ప్రకారం బయటి వ్యక్తులు జమ్మూ కశ్మీర్లో భూమి లేదా ఆస్తులు కొనుగోలు చేయడం కుదరని ప‌రిస్థితి ఉంది. అదే విధంగా..

యుద్ధం, విదేశీ దురాక్రమణ సమయంలోనే కేంద్రం ఆ రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించగలదు. అంతర్గత ఘర్షణలు తలెత్తినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి లేనిదే ఎమర్జెన్సీ విధించలేకుండా చ‌ట్టంలో స్ప‌ష్టం చేసారు. ఇక‌, ఇప్పుడు మొత్తంగా 370 ఆర్టిక‌ల్ ర‌ద్దు చేయ‌టం ద్వారా పూర్తిగా దేశం మొత్తంగా పౌరుల‌కు ఎటువంటి హ‌క్కులు.. కేంద్రానికి ఎటువంటి అధికారాలు ఉంటారో అవ‌న్నీ ఇప్పుడు జ‌మ్ము కాశ్మీర్‌లోనూ అమ‌లు కానుంది.

చాలా కాలంగా ఈ చ‌ట్టం పైన అభ్యంత‌రాలు..

చాలా కాలంగా ఈ చ‌ట్టం పైన అభ్యంత‌రాలు..

ఆర్‌య‌స్‌య‌స్ నేత‌లు చాలా కాలంగా జ‌మ్ము కాశ్మీర్ భార‌త దేశంలో అంత‌ర్బాగ‌మని..ఇటువంటి ప‌రిస్థితుల్లో ఆ రాష్ట్ర విష‌యంలో ప్ర‌త్యేక చ‌ట్టాలు ఎందుకున్న‌ది ఆర్‌య‌స్‌య‌స్ నేత‌ల వాద‌న‌. దీని పైన కోర్టుల్లో కేసులు న‌డిచాయి. ఆర్టి క‌ల్ 370 ఆధారంగానే నిర్ణ‌యాలు ఉండాల‌నే కోర్టు తీర్పులు ఉన్నాయి. అయితే, జ‌మ్ము కాశ్మీర్ విష‌యంలో త‌మ‌కు పూర్తి మెజార్టీ ఉన్న స‌మ‌యంలో ఈ వివాదానికి శాశ్వ‌త ప‌రిష్కారం చూపించాని ప్ర‌ధాని మోదీ ఆలోచ‌న‌గా క‌నిపిస్తోంది. దీంతో..కాశ్మీర్‌లో ముంద‌స్తుగా భారీగా బ‌ల‌గాల మొహ‌రింపు..అమ‌ర్‌నాధ్ యాత్ర ర‌ద్దు వంటి నిర్ణ‌యాల‌తో చాలా ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ఈ నిర్ణ‌యం తీసుకుంది. రాజ్య‌స‌భ‌లో బిల్లు ప్ర‌వేశ పెట్టే స‌మ‌యంలోనే ఆర్టిక‌ల్ 370ను ర‌ద్దు చేస్తూ రాష్ట్ర ప‌తి ఆమోద ముద్ర వేసారు. ఆ వెంట‌నే గెజిట్ విడుద‌ల అయింది. దీని ద్వారా ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అమ‌ల్లో ఉన్న కీల‌క‌మైన 35ఏ చ‌ట్టం సైతం ర‌ద్దు అవుతుంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Indian Govt abolished article 370 immediately. After cabinet decision president approved article 370 abolish and published Gazette. With this decision special rights and privileges of the citizens of Jammu and Kashmir come to abolish.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more