వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌లో పేలుళ్లకు కుట్ర: అమెరికాలో ఎన్నారైకి 15ఏళ్ల జైలు

భారత్‌కు చెందిన బల్వీందర్‌ సింగ్‌ అనే 42ఏళ్ల వ్యక్తి అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. పంజాబ్‌లో ఖలిస్థాన్‌ ఉద్యమ సమయంలో ఉగ్రదాడులకు, ఓ భారతీయ ప్రభుత్వ అధికారిని హత్య చేసేందుకు పన్నిన కుట్ర.

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్‌: ఉగ్రవాదుల సహకారంతో మనదేశంలో పేలుళ్లకు కుట్ర చేసిన ఎన్నారై వ్యక్తికి అమెరికా కోర్టు 15ఏళ్ల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే.. భారత్‌కు చెందిన బల్వీందర్‌ సింగ్‌ అనే 42ఏళ్ల వ్యక్తి అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. పంజాబ్‌లో ఖలిస్థాన్‌ ఉద్యమ సమయంలో ఉగ్రదాడులకు, ఓ భారతీయ ప్రభుత్వ అధికారిని హత్య చేసేందుకు పన్నిన కుట్రలకు సహకరించాడని బల్వీందర్‌పై ఆరోపణలు ఉన్నాయి.

కాగా, ఈ ఆరోపణలు రుజువు కావడంతో నేవెడా రాష్ట్రం రెనో నగరంలోని యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి లారీ హిక్స్‌ అతడిని దోషిగా నిర్ధారించి శిక్ష విధించారు. కాగా, అమెరికాలో శాశ్వత నివాస హోదా ఉన్న బల్వీందర్‌ 2013 సెప్టెంబరు, డిసెంబరు మధ్య కాలంలో పంజాబ్‌లో జరిగిన ఖలిస్థాన్‌ ఉద్యమ సమయంలో ఉగ్రదాడులకు సహకరించగా గత నవంబరులో కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది.

Indian man gets 15 yrs in US jail for plotting terror attack in his home country

2013 అక్టోబరులో బల్వీందర్‌తో పాటు మరో ఇద్దరు కుట్రదారులకు కూడా భాగస్వామ్యం ఉందని.. వీరిలో ఒకరు భారత్‌కు వెళ్లి భారతీయ అధికారిని చంపాలనుకున్నారని రుజువైంది. 2013 నవంబరులో బల్వీందర్‌ రెండు నైట్‌ విజన్‌ గాగుల్స్‌, ల్యాప్‌టాప్‌ కొని దాడికి పాల్పడాలనుకున్న వ్యక్తికి అందజేసినట్లు విచారణలో తేలింది. ఆ వ్యక్తి బ్యాంకాక్‌ వెళ్లేందుకు శాన్‌ఫ్రాన్సిస్‌కో అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ఎక్కేందుకు ప్రయత్నించగా అధికారులు పట్టుకున్నారు.

కాగా, బల్వీందర్‌ రెండు ఉగ్రవాద గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్నాడని, ఉగ్రదాడులకు సహకరించాడని యూఎస్‌(నేవెడా) అటార్నీ జనరల్‌ డేనియల్‌ బోగ్డెన్‌ తెలిపారు.
అమెరికాను, తన మిత్ర దేశాలను రక్షించడానికి అమెరికాలోని మల్టి-లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పడానికి ఈ కేసు నిదర్శనమని బోగ్డెన్‌ అన్నారు.

అయితే, బల్వీందర్ సింగ్ ఇప్పటికే మూడేళ్లపాటు జైలు శిక్ష అనుభవించి మంచి ఖైదీగా గుర్తింపు తెచ్చుకున్నందున మరో పదేళ్ల తర్వాత జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉందని అసిస్టెంట్ యూఎస్ అటార్నీ బ్రియాన్ సులివాన్ తెలిపారు. దీనిపై న్యాయమూర్తిదే తుది నిర్ణయమని చెప్పారు.

English summary
A 41-year-old citizen of India was sentenced Tuesday to 15 years in a US prison after he pleaded guilty to conspiring while living in northern Nevada to plot terror strikes in his home country on the border with Pakistan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X