గల్ఫ్ లో భారత్ భారీ రెస్క్యూ ఆపరేషన్
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో హార్ముజ్ జలసంధి ఇప్పుడు కీలకంగా మారింది. అమెరికా, ఇరాన్ మధ్య హార్ముజ్ జలసంధిపై ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇరు దేశాలు పరస్పరం బెదిరింపులకు దిగుతున్నాయి. జలసంధిని 48 గంటల్లోపు పూర్తిగా తెరవకపోతే విద్యుత్ కేంద్రాలపై సైనిక చర్యకు దిగుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి.
భారత్ సహా దాదాపుగా అన్ని దేశాలకు చెందిన కార్గో షిప్ లో రోజుల తరబడి అక్కడ చిక్కుకుపోయాయి. ఫలితంగా ఆయా దేశాల్లో ఇంధన కొరత తలెత్తుతోంది. దీన్ని నివారించడానికి భారత నౌకాదళం రంగంలోకి దిగింది. భారత్ కు చెందిన 18 షిప్పులు అక్కడ చిక్కుకుపోయిన నేపథ్యంలో వాటిని తిరిగి తీసుకుని రావడానికి అతిపెద్ద రెస్క్యూ మిషన్ ను లాంచ్ చేసింది. నౌకాదళంతో పాటు వివిద మంత్రిత్వ శాఖల జాయింట్ టాస్క్‌ఫోర్స్ ఈ ఆపరేషన్ లో దిగింది.

దేశ ఇంధన భద్రతను పునరుద్ధరించడం, పోర్టుల్లో పేరుకుపోయిన లక్షకు పైగా ట్వంటీ ఫుట్ ఈక్వెవెలంట్ కార్గోలను తీసుకుని రావడం దీని ముఖ్య ఉద్దేశం. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల వల్ల ఆయా కార్గో షిప్ ల రాకపోకలకు తీవ్ర అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఆయిల్, ఎల్పీజీ, ఎల్ఎన్జీ వంటి ఇంధనాలను తరలించే క్యారియర్లు అవి. వాటన్నింటినీ సురక్షితంగా తిరిగి తీసుకుని రావడానికి ప్రభుత్వం సమగ్ర యాక్షన్ ప్లాన్ ను రూపొందించింది.
మొత్తం 18 నౌకలలో ఎల్పీజీ క్యారియర్లు- 4, ఎల్ఎన్జీ కంటైనర్లు- 3, ముడి చమురు ట్యాంకర్లు- 11 ఉన్నాయి. ఇందులో అయిదు మనదేశానికి చెందినవి. మిగిలినవి లీజుకు తీసుకున్నవి. హోర్ముజ్ జలసంధికి పశ్చిమాన 15, గల్ఫ్ ఆఫ్ ఒమన్, గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లలో మూడేసి, రెడ్ సీలో రెండు నౌకలు చిక్కుకుపోయాయి. ఎల్పీజీ షిప్ గ్రీన్ ఆశా ఇప్పటికే హోర్ముజ్ జలసంధిని దాటి ముంబై పోర్ట్ దిశగా ప్రయాణిస్తోన్నట్లు సమాచారం. ఇది కొంత వరకు ఉపశమనం కల్పిస్తోంది.
ప్రస్తుతం పోర్టులలో 1,06,890 ట్వంటీ ఫుట్ ఈక్వెవెలంట్ కంటైనర్లు, పాడైపోయే సరుకు నిలిచిపోయింది. సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకు గల్ఫ్‌కు రవాణాను నిలిపివేయాలని ఇదివరకే పోర్టు నిర్వాహకులు కేంద్రాన్ని కోరారు. షిప్పింగ్ కంపెనీలకు డాకింగ్ ఫీజులు తగ్గించి, డెమరేజ్, డాకింగ్ ఛార్జీలను తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. నౌకలతో పాటు పర్షియన్ గల్ఫ్ దాని పరిసర ప్రాంతాలలో 20,000 మంది భారతీయ నావికులు చిక్కుకున్నారని, వారిని వెనక్కి తీసుకుని రావాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications