Navy: నడి సముద్రంలో 36 మంది.. 30 గంటల పాటు ఉత్కంఠ.. చివరికి..!
చేపల వేటకు వెళ్లి నడి సముద్రంలో చిక్కుకుపోయిన 36 మంది మత్స్యకారులను భారత నావికాదళం రక్షించింది. ఐఎన్ఎస్ ఖంజర్ సాయంతో నేవీ దాదాపు 30 గంటలు శ్రమించి మత్య్సకారులను తీసుకొచ్చారు. తమిళనాడులోని నాగపట్టణం తీరం నుంచి 36 మత్స్యకారులు చేపల వేటకు బంగాళాఖాతంలోకి వెళ్లారు. సముద్రంలో వాతావరణ పరిస్థితుల కారణంగా వారు అనుకున్న సమయంలో తీరానికి చేరుకోలేకపోయారు.
ఆ తర్వత బోట్లలో ఇంధనం లేకపోవడం అదే సమయంలో ఇంజిన్లలో సమస్య తలెత్తడంతో వారంతా సముద్రంలో చిక్కుకుపోయారు. మత్స్యకారులు వారి కుటుంబాలకు సమాచారం ఇవ్వడంతో.. మత్స్యకారుల కుటుంబ సభ్యులు నేవీకి సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన నేవీ బంగాళాఖాతంలో విధుల్లో ఉన్న ఐఎన్ఎస్ ఖంజర్ ను రంగంలోకి దింపింది.

నేవీ సిబ్బంది ఐఎన్ఎస్ తో మత్స్యకారుల కోసం గాలింపు చేపట్టారు. తమిళనాడు తీరానికి 129 నాటికల్ మైళ్ల దూరంలో మూడు పడవలు కనిపించాయి. దీంతో నేవీ సిబ్బంది వెంటనే అక్కడి వెళ్లి మత్స్యకారులను రక్షించారు. మూడు బోట్లకు తాడు కట్టి 30 గంటల పాటు శ్రమించి ఒడ్డుకు లాక్కొచ్చారు. మూడు ఫిషింగ్ నాళాలను నాగపట్టినంకు చెందిన సబారైనాథన్, కలైవానీ, వి సామిగా గుర్తించారు.మత్స్యకారులను చెన్నై హార్బర్‌కు సురక్షితంగా తీసుకొచ్చారు.












Click it and Unblock the Notifications