వేరేవారి టికెట్ పై మీరు రైల్వే ప్రయాణం చేయొచ్చు!

తరుచుగా రైలు ప్రయాణం చేసేవారికి ఒక గమనిక. మీరు తరుచుగా ప్రయాణాలు చేస్తుంటారు కాబట్టి ఒకవేళ మీకు టికెట్ దొరక్కపోయినా వేరేవారి టికెట్ పై సులువుగా ప్రయాణం చేసే అవకాశం ఉంది. దానిగురించి తెలుసుకుందాం. ఇండియన్ రైల్వేస్ తాజాగా ఓ నిబంధన తీసుకొచ్చింది. మికు టికెట్ లేకపోయినా అత్యవసర సమయంలో మీ కుటుంబం సభ్యుల టికెట్‌పై ప్రయాణం చేసే వెసులుబాటు కల్పించింది.

మీరు ఎవరి టికెట్ పై ప్రయాణం చేయాలనుకుంటున్నారో వారికి మీరు రక్తసంబంధీకులై ఉండాలి. అంటే తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, తోబుట్టువులు లేదంటే పిల్లల పేరుపై టికెట్ ఉంటే ఆ టికెట్ పై సులభంగా ప్రయాణం చేయవచ్చు. ముందుగా ఎవరైతే ప్రయాణం చేయాలనుకుంటున్నారో వారు తమ పేరును నమోదు చేయాల్సి ఉంటుంది. రైలు బయలుదేరే 24 గంటల ముందుగా సంబంధిత రైల్వే అధికారులకు అవసరమైన పత్రాలు సమర్పించి దరఖాస్తు చేసుకోవాలి.

indian railway implements vikalp scheme

వాటిని రైల్వే ఉన్నతాధికారులు పరిశీలించి టికెట్ పై ప్రయాణించాల్సిన సభ్యుడి పేరును కూడా ఉంచుతారు. దీంతోపాటు విద్యాసంస్థల విద్యార్థులకు టికెట్ బదిలీ చేయవచ్చు. రైలు బయలుదేరడానికి 48 గంటల ముందు అవసరమైన పత్రాలతో ఇన్ స్టిట్యూట్ కు సంబంధించిన పత్రాలతో అధికారులకు రాతపూర్వకంగా దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత మీకు ఆ టికెట్ ను ఖరారు చేస్తారు.

పండగ సమయంలో సొంతూళ్లకు వెళ్లేందుకు రెండు నెలల ముందే టికెట్ బుక్ చేసుకున్నా దొరకని పరిస్థితి ఉంటుంది. ఆ సమయంలో టికెట్ల సమస్యను వికల్ప్ పథకంద్వారా పరిష్కరించడానికి అవకాశం ఉంది. వెయిటింగ్ లిస్టులో టికెట్ కన్ఫర్మ్ కాని ప్రయాణికులు మరొక రైలులో సీటును కన్ ఫర్మ్ చేసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+