సంక్రాంతి పండగకు భారతీయ రైల్వే శుభవార్త
ప్రతి ఏడాది సంక్రాంతి పండగ సందర్భంగా రైళ్లు కిక్కిరిసిపోతాయనే విషయం తెలిసిందే. రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే ఈ ఏడాది 32 ప్రత్యేక రైళ్లను నడపనుంది. సికింద్రాబాద్-బ్రహ్మపుర్, బ్రహ్మపుర్-వికారాబాద్, విశాఖపట్నం-కర్నూలు సిటీ, శ్రీకాకుళం-వికారాబాద్, సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-కాకినాడ టౌన్, సికింద్రాబాద్-నర్సాపూర్ మార్గాల్లో తిరుగుతాయి. 2024 జనవరి 7వ తేదీ నుంచి జనవరి 27 మధ్య వివిధ తేదీల్లో ప్రయాణించనున్న ఈ ప్రత్యేక రైళ్ల వివరాలు తెలుసుకుందాం.
జనవరి 7, 14 తేదీల్లో సికింద్రాబాద్ నుంచి బ్రహ్మపూర్ ( ట్రైన్ నంబర్ 07089 )
జనవరి 8, 15న బ్రహ్మాపూర్ నుంచి వికారాబాద్ (07090)
జనవరి 9, 16న వికారాబాద్ నుంచి బ్రహ్మపూర్ (07091)
జనవరి 10, 17న బ్రహ్మాపూర్ నుంచి సికింద్రాబాద్ (07092)
జనవరి 10, 17, 24 తేదీల్లో విశాఖపట్నం నుంచి కర్నూలు సిటీ (08541)

జనవరి 12, 19, 26 తేదీల్లో శ్రీకాకుళం నుంచి వికారాబాద్ (08547)
జనవరి 13, 20, 27 తేదీల్లోవికారాబాద్ నుంచి శ్రీకాకుళం (08548)
జనవరి 10, 17నసికింద్రాబాద్ నుంచి తిరుపతి (02764)
జనవరి 11, 18నతిరుపతి నుంచి సికింద్రాబాద్ (02763)
జనవరి 12న సికింద్రాబాద్ - కాకినాడ టౌన్ (07271)
జనవరి 13న కాకినాడ టౌన్-సికింద్రాబాద్ (07272)
జనవరి 8, 15నసికింద్రాబాద్ - బ్రహ్మపూర్ (07093)
జనవరి 9, 16నబ్రహ్మాపూర్ - సికింద్రాబాద్ (07094)
జనవరి 10న నర్సాపూర్ - సికింద్రాబాద్ (07251)
జనవరి 11న సికింద్రాబాద్ - నర్సాపూర్ (07252)












Click it and Unblock the Notifications