Railway Ticket : రైల్వే టికెట్ రేట్ల వెనుక రహస్యం? ఆర్టీఐకి సైతం సీక్రెట్ చెప్పలేదే!
రైలు టికెట్ ధరలు ఒక్కోసారి ఎందుకు మారుతాయి? తత్కాల్ బుకింగ్‌లో ధరలు ఎందుకు ఒక్కసారిగా పెరుగుతాయి? అనే ప్రశ్నలు తరచూ ప్రయాణికులను వేధిస్తుంటాయి. అయితే ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేమంటూ, టికెట్ ఛార్జీల లెక్కింపు విధానాన్ని “వ్యాపార రహస్యం” గా పేర్కొన్న భారతీయ రైల్వేలు, సమాచార హక్కు చట్టం (RTI) కింద ఈ వివరాలను వెల్లడించలేమని కేంద్ర సమాచార కమిషన్ (CIC)కు స్పష్టం చేశాయి.
పశ్చిమ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ వంటి నిర్దిష్ట రైళ్ల టికెట్ ధరలు ఎలా నిర్ణయించబడతాయనే అంశంపై దాఖలైన ఆర్టీఐ దరఖాస్తును సీఐసీ తాజాగా కొట్టివేసింది. బేస్ ఛార్జీలు, డైనమిక్ ప్రైసింగ్ విధానం, తత్కాల్ టికెట్ల ప్రభావం వంటి అంశాలపై వివరాలు కోరినా, వాటిని వెల్లడించలేమని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. ఛార్జీలు ప్రయాణికులు ఎంచుకునే తరగతిపై, ఆ తరగతిలో అందించే సౌకర్యాలపై ఆధారపడి ఉంటాయని మాత్రమే సాధారణ సమాచారం ఇచ్చింది.

రైల్వే బోర్డు ప్రకారం, రైలు భోగీల వర్గీకరణ, స్లీపర్ క్లాస్ ల ఛార్జీల నిర్ణయానికి సంబంధించిన విధానం వ్యాపార రహస్యంతో పాటు మేధో సంపత్తి హక్కుల పరిధిలోకి వస్తుందిని తెలిపింది. అందువల్ల ఈ సమాచారం ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 8 కింద వెల్లడించలేమని పేర్కొంది. ఈ సెక్షన్ జాతీయ భద్రత, వాణిజ్య రహస్యాలు, వ్యక్తిగత గోప్యత వంటి సున్నితమైన అంశాలను రక్షిస్తుంది.
ఈ అంశంపై గతంలో సీఐసీ ఇచ్చిన ఆదేశాలను కూడా రైల్వే అధికారులు ప్రస్తావించారు. ధరల లెక్కింపు విధానాన్ని పూర్తిగా వెల్లడించాల్సిన అవసరం లేదన్న వాదనను కమిషన్ ఇప్పటికే సమర్థించిందని తెలిపారు. భారతీయ రైల్వే ఒక వాణిజ్య సంస్థగా పనిచేస్తూనే, దేశ సేవలో సామాజిక బాధ్యతలను కూడా నిర్వర్తిస్తున్న సంస్థగా ఉందని రైల్వేలు వివరణ ఇచ్చాయి.

రైల్వే బోర్డు ముఖ్య ప్రజా సమాచార అధికారి (CPIO) మాట్లాడుతూ, టికెట్ ధరల విధానంపై పూర్తి వివరాలను వెల్లడించడం ప్రజా ప్రయోజనాలకు అనుకూలం కాదని అభిప్రాయపడ్డారు. రైల్వేలు పొందే లాభం వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా, ప్రజాసేవకే వినియోగించబడుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కేసులో ఇప్పటికే వెల్లడించదగిన సమాచారాన్ని రైల్వేలు అందించాయని సీఐసీ గమనించింది. అందుబాటులో లేని కొత్త సమాచారం సృష్టించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అప్పీలుదారు విచారణకు హాజరుకాకపోవడం, అలాగే రైల్వేల స్పందనలో లోపాలు లేవని భావించిన సమాచార కమిషనర్ స్వాగత్ దాస్, తదుపరి జోక్యం అవసరం లేదంటూ అప్పీల్‌ను కొట్టివేశారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications