ఫేస్‌బుక్‌లో మోడీపై వ్యంగ్యచిత్రం: భారత ఉపాధ్యాయురాలి తొలగింపు
దోహా: భారత ప్రధాని నరేంద్ర మోడీపై వ్యంగ్య చిత్రాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిందన్న ఆరోపణలతో ఖతర్ రాజధాని దోహాలో ఓ ఉపాధ్యాయురాలిపై వేటు పడింది. ఇక్కడి భారతీయులకు చెందిన ఎంఈఎస్ స్కూల్‌లో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలు వారంక్రితం తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో మోడీకి సంబంధించి కార్టూన్‌ను పోస్ట్ చేసింది.
ఆమె తన ఫేస్‌బుక్‌లో స్కూల్ లోగోను కూడా ఉపయోగించారని, దీంతో పాఠశాల ప్రతిష్ట దెబ్బతినే ప్రమాదం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. స్పందించిన యాజమాన్యం.. తొలుత మూడురోజులపాటు విచారణ నిమిత్తం ఆ ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేసింది.

గురువారం ఆమెను పూర్తిగా విధుల నుంచి తప్పిస్తున్నట్టు ప్రకటించింది. సదరు టీచర్ పేరును స్కూల్ యాజమాన్యం బయటపెట్టలేదు. ‘నేను ఎలాంటి తప్పూ చేయలేదు. ఎలాంటి కార్టూన్‌ను పోస్ట్ చేయలేదు. ఎవరినుంచో ఆ చిత్రం వస్తే దాన్ని షేర్ చేశానంతే.. మోడీని అవమానించాలనే ఉద్దేశం నాకు లేదు' అని టీచర్ స్థానిక మీడియాకు తెలిపింది.
కాగా, ఆమె కార్టూన్‌ను పోస్టు చేసిన తర్వాత ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసిన పలువురు భారతీయులు విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. దోహాలోని భారత ఎంబసీకి కూడా ఆమె పోస్టుపై ఫిర్యాదులు అందాయి. సదరు పాఠశాలకు తమకందిన ఫిర్యాదులను పంపించామని, అది ప్రైవేటు పాఠశాల కావడంతో తాము జోక్యం కోలేమని భారత ఎంబసీ అధికారి ఒకరు తెలిపారు. సదరు టీచర్‌ను తొలగించినట్లు తెలిసిందని ఆయన చెప్పారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications