భారత్‌లో ఎంట్రీ ఇస్తున్న RapidX: ఆ రైళ్లకు ‘నమో భారత్’గా నామకరణం, కాంగ్రెస్ ఫైర్
న్యూఢిల్లీ: వందే భారత్ రైళ్ల తరహాలోనే ఆధునిక టెక్నాలతో రూపొందించి దేశంలో తొలిసారి ప్రవేశపెడుతున్న ర్యాపిడ్‌ఎక్స్ (RapidX) సెమీ-హైస్పీడ్ రైళ్లకు పేరు మార్చారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ రైళ్లను ప్రారంభించడానికి ఒక్క రోజు ముందు అంటే గురువారంనాడు రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్(RRTS) పేరును 'నమో భారత్'గా నామకరణం చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఢిల్లీ-ఘజియాబాద్-మీరఠ్ ఆర్ఆర్టీఎస్ కారిడార్‌లో సాహిబాబాద్, దుహై డిపో మధ్య సేవలందించే ర్యాపిడ్‌ఎక్స్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబర్ 20న ప్రారంభించనున్న విషయం తెలిసిందే. మొదట 17 కి.మీల పరిధిలో ఐదు స్టేషన్ల మధ్య అక్టోబర్ 21 నుంచి ఈ రైళ్లు సేవలందించనున్నాయి.
రూ. 30 వేల కోట్లతో చేపట్టిన 85.2 కి.మీల ఢిల్లీ-ఘజియాబాద్-మీరఠ్ ఆర్ఆర్టీఎస్ కారిడార్ కు ప్రధాని నరేంద్ర మోడీ 2019 మార్చి 8న శంకుస్థాపన చేశారు. దీన్ని 2025 జూన్ నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా, ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ RRTS కారిడార్‌లోని 17-కిమీ ప్రాధాన్యత విభాగంలో సాహిబాబాద్ నుంచి దుహై డిపో స్టేషన్ వరకు వన్-వేలో ప్రయాణించే ధర రూ. 50, అదే రూట్‌లో ప్రీమియం-క్లాస్ కోచ్ ఎంపిక రూ. 100కి అందుబాటులో ఉంటుంది.

'ప్రాధాన్యత విభాగం ప్రారంభించిన ఒక రోజు తర్వాత, అక్టోబర్ 21 ఉదయం నుంచి ప్యాసింజర్ సేవలు ప్రారంభమవుతాయి. RAPIDX రైళ్లు ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు పనిచేస్తాయి. ప్రారంభంలో, ప్రతి 15 నిమిషాలకు రైళ్లు అందుబాటులో ఉంటాయి, అయితే భవిష్యత్తులో అవసరం ప్రాతిపదిక ఫ్రీక్వెన్సీని పెంచవచ్చు' అని మీడియాకు ఓ అధికారి వెల్లడించారు.
సాహిబాబాద్, దుహై డిపోల మధ్య 17 కిలోమీటర్ల దూరానికి ప్రజలు దాదాపు రూ. 100-150 ఖర్చు చేయాల్సి ఉంటుందని నివేదిక పేర్కొంది. అలాగే, ప్రజలు ఘజియాబాద్ నుంచి సాహిబాబాద్ వరకు సుమారు రూ. 75-90 వసూలు చేయవచ్చు. ఈ రెండు పాయింట్ల మధ్య మెట్రో సేవలు అందుబాటులో లేకపోవడం గమనార్హం.
ఇది ఇలావుంటే, ర్యాపిడ్ఎక్స్ రైళ్లకు 'నమో భారత్'గా పేరు మార్పు చేసినట్లు వచ్చిన వార్తలపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నమో స్టేడియం తర్వాత.. ఇప్పుడు నమో రైళ్లు. స్వీయ ప్రచారానికి హద్దు లేకుండా పోయింది అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ట్విట్టర్ వేదికగా విమర్శించారు.
-
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
అమృత్ భారత్ రైలులో పురిటి నొప్పులు.. కట్ చేస్తే ఆసుపత్రికి వెళ్ళేలోపే..! -
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
ఐఆర్సీటీసీలో 3 కోట్ల ఫేక్ ఖాతాల తొలగింపు.. కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్












Click it and Unblock the Notifications