పసిడి ధరల పతనానికి బ్రేక్.. !!
బంగారంలో పెట్టుబడులు పెట్టిన వారికి ఇది ఊరటనిచ్చే వార్త. దేశీయంగా పసిడి ధరలు వరుసగా పెరిగాయి. వరుసగా నాలుగురోజుల పాటు భారీగా పతనాన్ని చవిచూసిన పసిడి రేట్లకు తాత్కాలిక బ్రేక్ పడింది. నేడు స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ విపణిలో బలహీనమైన సంకేతాలు, డాలర్ బలోపేతం కావడం వంటి కారణాలతో బంగారం ధరలు ప్రభావితం అయ్యాయి. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. దేశీయ మార్కెట్లలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా స్వల్పంగా పెరిగి రూ. 1,50,600 వద్దకు చేరుకుంది.
దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో కూడా బంగారం ఫ్యూచర్స్ ట్రేడింగ్ భారీ ఒత్తిడిని ఎదుర్కొంది. డిసెంబర్ ఫ్యూచర్స్ ధర సుమారు 0.39 శాతంతో రూ. 270 లాభపడింది. సాధారణంగా శని, ఆదివారాల్లో స్థానిక బులియన్ మార్కెట్లకు సెలవు ఉంటుంది. కాబట్టి శుక్రవారం నాటి ముగింపు ధరలే ఈ రెండు రోజుల పాటు మార్కెట్లో వర్తిస్తాయి.

యూఎస్ వడ్డీ రేట్లను సుదీర్ఘ కాలం పాటు అధిక స్థాయిలోనే కొనసాగించే అవకాశం ఉందనే అంచనాలు కూడా నాన్-యీల్డింగ్ ప్రాపర్టీ అయిన బంగారం ధరలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపించాయి. స్విట్జర్లాండ్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య జరగాల్సిన శాంతి చర్చలు తాత్కాలికంగా వాయిదా పడినట్లు అక్కడి విదేశాంగ శాఖ స్పష్టం చేయడంతో పెట్టుబడిదారులలో మళ్లీ సందిగ్ధత మొదలైంది.
హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,45,860, 22 క్యారెట్లు రూ. 1,33,700 పలికింది. ముంబైలో 24 క్యారెట్లు రూ. 1,45,860, 22 క్యారెట్లు రూ. 1,33,700, చెన్నైలో 24 క్యారెట్లు రూ. 1,48,040, 22 క్యారెట్లు రూ. 1,35,700, బెంగళూరులో 24 క్యారెట్లు రూ. 1,45,860, 22 క్యారెట్లు రూ. 1,33,700 వద్ద స్థిరపడ్డాయి.
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 14,837, 22 క్యారెట్లు - రూ. 13,600, 18 క్యారెట్లు - రూ. 11,370
ముంబై..
24 క్యారెట్లు - రూ. 14,608, 22 క్యారెట్లు- రూ. 13,390, 18 క్యారెట్లు - రూ. 10,956
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 14,608, 22 క్యారెట్లు- రూ. 13,390, 18 క్యారెట్లు - రూ. 10,956
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 14,608, 22 క్యారెట్లు- రూ. 13,390, 18 క్యారెట్లు - రూ. 10,956
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 14,608, 22 క్యారెట్లు- రూ. 13,390, 18 క్యారెట్లు - రూ. 10,956
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 14,608, 22 క్యారెట్లు- రూ. 13,390, 18 క్యారెట్లు - రూ. 10,956

Click it and Unblock the Notifications