థియేటర్లలో పిచ్చెక్కిస్తున్న చిన్న సినిమా.. నీకు ఆస్కార్ గ్యారంటీ అన్నా..!
కంటెంట్ ఈజ్ కింగ్ అని ఇప్పటికే చాలా సినిమాలకు రుజువైంది. భారీ బడ్జెట్, పెద్ద పెద్ద హీరోలు, యాక్టర్స్ ఉన్న సినిమాల కంటే మంచి కథ, కంటెంట్ తో వస్తున్న చిన్న సినిమాలనే జనాలు ఆదరిస్తున్నారు. చిన్న సినిమాలో ఏదో తెలియని కొత్తదనం ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పిస్తోంది. పెద్ద సినిమాలపై భారీ ఆశలు పెట్టుకుంటే అవి బోల్తా పడేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిన్న సినిమాలదే ఈరోజుల్లో హవా నడుస్తోంది. ముఖ్యంగా మలయాళంలో చిన్న సినిమాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అక్కడ రిలీజ్ అయి తెలుగు లో డబ్ అవుతుంటాయి. అయితే విశేషం ఏంటంటే..? ఈ డబ్బింగ్ సినిమాలు కూడా టాలీవుడ్ లో భారీగా కలెక్షన్స్ ను చూస్తున్నాయి.
ఇటీవల ధనుష్ కర సినిమా తెలుగులోనూ హిట్ టాక్ తెచ్చుకుంది. అలాగే సూర్య వీరభద్రుడు మూవీని సైతం తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పుడు మరో సినిమా తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తోంది అదే బాలన్: ది బాయ్.. మలయాళం చిన్న సినిమా సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామాగా ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో ఆధిషేషన్, ఫర్జనా పలతింగల్, ముహమ్మద్ జినన్, డాలీ జూన్, టోవినో థామస్, జీన్ పాల్ లాల్, గిరిష్ ఏడి అండ్ బీనా ఆంటోనీ కీలక పాత్రల్లో నటించారు. మలయాళంలో సెన్సేషనల్ హిట్ అయిన మంజుమ్మల్ బాయ్స్ చిత్రానికి దర్శకత్వం వహించిన చిదంబరం.. ఈ సినిమాకూ దర్శకత్వం వహించారు. అందుకే సినిమాపై రిలీజ్ కు ముందే అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక సినిమా కథ విషయానికి వస్తే ఓ హత్య కేసులో జైలు జీవితం గడిపి తన చిన్నారి కొడుకుతో తల్లి బయటకు వస్తుంది. జైలు నుంచి బయటకు వచ్చాక వారు తమ గుర్తింపులను మారుస్తూ.. అనేక ఊళ్లు తిరుగుతూ ఉంటారు. ఆ తల్లి చెప్పే అబద్ధపు కథలను నిజమని కుమారుడు నమ్ముతుంటాడు. అసలు వాళ్లు ఎందుకు అలా ఊళ్లు తిరుగుతూ జీవిస్తున్నారో అర్థం కాదు.. ఈ క్రమంలో వాళ్లు ఓ వృద్ధురాలి వద్ద కేర్ టేకర్ గా చేరతారు. అక్కడ ఆమె గతానికి చెందిన ఓ వ్యక్తి వారికి ఎదురవుతాడు. ఆ వ్యక్తి ఎవరు..? ఆమె గతం ఏంటి..? తల్లి ఎందుకు అలా జీవిస్తోంది..? కుమారుడు గతం తెలుసుకున్నాడా..? అనే ఆసక్తికర కథనంపై సినిమా సాగుతుంది.

ఇక ఈ కథ చాలా గ్రిప్పింగ్ గా సాగుతుంది. జీతూ మాధవన్ అందించిన స్క్రీన్ ప్లే ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలుస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ లో ట్విస్ట్ లు బాగున్నాయి. సినిమా అక్కడక్కడా నెమ్మదిగా సాగుతుంది అదొక్కటే మైనస్.. ఇక ఈ సినిమా చూసిన ప్రేక్షకులు దర్శకుడికి ఆస్కార్ ఇవ్వాలని.. ఇండియా నుంచి అధికారికంగా ఈ సినిమాను ఆస్కార్ కు పంపాలని కోరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications