విజయ్ మరో సంచలనం.. బర్త్ డే వేళ వారికి భారీ కానుక..!
తమిళనాడు సీఎం దళపతి విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఏటా విద్యార్థులకు ఎడ్యూకేషనల్ అవార్డులు, స్కాలర్ షిప్ లు అందజేయాలని టీవీకే ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. యువతీ యువకులు అలాగే వారి తల్లిదండ్రులు పార్టీని అంటిపెట్టుకుని ఉండే విధంగా టీవీకే ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రతి నియోజకవర్గంలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంకులు సాధించిన విద్యార్థుల వివరాలను సమర్పించాలని అన్ని జిల్లాల సెక్రటరీలకు టీవీకే హై కమాండ్ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం జిల్లా యూనిట్లు ఇదే పనిమీద నిమగ్నమై ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది.
తమిళనాడు వెస్ట్ లోని ఓ డిస్ట్రిక్ట్ సెక్రటరీ.. విజయ్ ఏర్పాటు చేసిన విజయ్ మక్కల్ ఇయక్కమ్ రోజుల నుంచి ఆయన వెంటే ఉన్నారు. ఆయన తాజాగా ఇదే విషయంపై మాట్లాడారు. ఇలాంటి కార్యక్రమాలు తాము విజయ్ ఫ్యాన్ క్లబ్స్ పెట్టిన రోజుల నుంచి చేస్తున్నామని తెలిపారు. ఈ విధానాన్ని తాము ఉద్యమంలా వ్యాప్తి చేశామని అన్నారు. పార్టీ పెట్టాక.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను స్వయంగా కలిసి అవార్డులు అందించాలని విజయ్ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. అన్ని జిల్లాల నుంచి లిస్టులు వచ్చిన తర్వాత టీవీకే నాయకత్వం ఓ తేదీ, ప్రదేశాన్ని నిర్ణయించి కార్యక్రమాలను పూర్తి చేస్తుందని అన్నారు. గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా ఈ కార్యక్రమాన్ని సింగిల్ ఫేజ్ లో నిర్వహిస్తామని పేర్కొన్నారు.
గతేడాది ఇలాంటి కార్యక్రమమే టీవీకే పార్టీ చేపట్టింది. ఆ సమయంలో ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి దాదాపు 600 మంది మెరిటోరియస్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులకు టీవీకే అధ్యక్షుడు విజయ్ వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలిపి అవార్డులు ప్రధానం చేశారు. విద్యార్థులు స్టడీస్, సామాజిక బాధ్యతపైన ఏకాగ్రత పెట్టాలని సూచించారు.

ఇప్పుడు టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతంగా నిర్వహించాలని టీవీకే ప్రభుత్వం భావిస్తోంది. ఈసారి కూడా సీఎం విజయ్.. విద్యార్థుల్ని వ్యక్తిగతంగా కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. అయితే జూన్ 22న విజయ్ బర్త్ డే ఉన్న నేపథ్యంలో అదే రోజు ఈ కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications